Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబంలో నలుగురి ఘోర హత్య.. మూసి ఉన్న ఇంట్లో భయంకర దృశ్యం
బంగ్లాదేశ్‌లోని(Bangladesh) రంగ్‌పూర్ నగరంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే దారుణ ఘటన చోటుచేసుకుంది.
Four members of a hindu family found dead in rangpur Bangladesh
- ఒకే కుటుంబంలో నలుగురి హత్య
- మూసి ఉన్న ఇంట్లో మృతదేహాలు
- రంగంలోకి దిగిన సీఐడీ బృందాలు
Bangladesh: బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. విశ్రాంత ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియం (12) ఘోర హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి వేళ వీరిని గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు భావిస్తున్నారు.
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 3 వేల DSC పోస్టుల భర్తీ.. నారా లోకేష్ కీలక ప్రకటన
తాళం వేసిన ఇంట్లో దొరికిన మృతదేహాలు:
కుటుంబ సభ్యుల(Bangladesh) ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన బంధువులు శనివారం రాత్రి ఇంటికి వెళ్లి చూడగా బయట తాళం వేసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా భయంకర దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోని వేర్వేరు ప్రాంతాలలో మృతదేహాలు పడి ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ, డిటెక్టివ్ బృందాలు
ఈ ఘోర ఉదంతంపై రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, సీఐడీ (CID), డిటెక్టివ్ బ్రాంచ్ బృందాలు సంయుక్తంగా సమగ్ర విచారణను వేగవంతం చేశాయి. పదవీ విరమణ తర్వాత హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్న గణపతి చక్రవర్తి కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని బంధువులు చెబుతుండగా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
