కొండచరియల కింద 10మంది సజీవ సమాధి..9మంది ఒకే కుటుంబంలోని వారు

  • Published By: nagamani ,Published On : September 24, 2020 / 04:18 PM IST
కొండచరియల కింద 10మంది సజీవ సమాధి..9మంది ఒకే కుటుంబంలోని వారు

Updated On : September 24, 2020 / 4:54 PM IST

కొండల చరియలు విరిగిపడి 10మంది సజీమ సమాధి అయిపోయారు. కొండలకింద 10 ప్రాణాలు అసువులుబాసిన దుర్ఘణ నేపాల్ లో చోటుచేసుకుంది. ఈ 10మందిలో 9 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావటం మరో విషాదం. నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సియాంగ్జా జిల్లాలోని తామాడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.


ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఈ 10మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సియాంగ్జా జిల్లా ప్రధాన అధికారి అధికారి గంగా బహదూర్ చెత్రి తెలిపారు. ఇందులో 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవని ఆయన తెలిపారు. గాయపడిన 17ఏళ్ల అమ్మాయిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.


స్థానిక మీడియా కథనం ప్రకారం గురువారం (సెప్టెంబర్ 24,2020) తెల్లవారుఝామున 5.30 గంటలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇంటిలో నిద్రిస్తున్న తొమ్మిదిమంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటీన సహాయక సిబ్బందితో తరలివచ్చారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిని బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతదేహాలను శిథిలాల క్రిందనుంచి వెలికి తీశారు. అలాగే మరిన్ని కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు జాగ్రత్తతో అక్కడ ఉండే స్థానికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.


నేపాల్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉరుములు…మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వరదనీటికి నదుల నీటి మట్టాలు పెరుగుతాయని కా..కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.