Nepal Plane Crash History : నేపాల్ లో అనేక విమాన ప్రమాదాలు.. ఎన్ని విమానాలు కుప్పకూలాయి? ఎంత మంది చనిపోయారు?

నేపాల్‌లో విమాన ప్రమాదాల సుదీర్ఘ చరిత్ర ఉంది.  అనేక విమానాలు కుప్పకూలాయి. మరికొన్ని పర్వతాలను ఢీకొన్నాయి.  ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది చనిపోయారు.  జులై, 1969లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సినారా ఎయిర్ పోర్టులో కుప్పకూలడంతో 31 మంది ప్రయాణికులతోపాటు నలుగురు క్ర్యూ సభ్యులు మృతి చెందారు.

Nepal Plane Crash History : నేపాల్‌లోని పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్‌ వేపై విమానం కుప్పకూలి 68 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. అది ఖాట్మాండు నుంచి పొఖ్రా వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానానికి మంటలు అంటుకున్నాయి. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పారు. సహాయక బృందాలు కొంతమంది ప్రయాణికులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.

అయితే నేపాల్‌కు విమాన ప్రమాదాల సుదీర్ఘ చరిత్ర ఉంది.  అనేక విమానాలు కుప్పకూలాయి. మరికొన్ని పర్వతాలను ఢీకొన్నాయి.  ఈ ఘటనలో అనేక మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది చనిపోయారు.  జులై, 1969లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సినారా ఎయిర్ పోర్టులో కుప్పకూలడంతో 31 మంది ప్రయాణికులతోపాటు నలుగురు క్ర్యూ సభ్యులు మృతి చెందారు.
జులై 1992లో థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్(310) ఖాట్మాండులో దిగుతుండగా
కుప్పకూలింది. దీంతో విమానంలోని 99 మంది ప్రయాణికులతోపాటు 14 సిబ్బంది మరణించారు.

Pokhara Airport: రన్‌ వేపై కుప్పకూలిన నేపాల్ విమాన బ్లాక్‌బాక్స్ లభ్యం

జులై, 1993లో ఎవరెస్టు ఎయిర్ కు చెందిన డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ నేపాలోని చూలే ఘోప్టే పర్వతం వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 16 ప్రయాణికులతోపాటు ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. సెప్టెంబర్, 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ (A300) ఖాట్మాండు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 167 మంది మృతి చెందారు.  జులై,2000లో రాయల్ నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ట్విన్ ఒట్టర్ విమానం నేపాలోని ధంఘదీకి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో కుప్పకూలింది.

దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 22 మందితోపాటు ముగ్గురు సిబ్బందితోపాటు అనేక మంది చనిపోయారు. నవంబర్,2001లో పశ్చిమ నేపాల్‌లో విమానంపై చార్టెడ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నేపాల్ యువరాణి ప్రేక్ష్యా షాతోపాటు 6 మంది నివాసితులు మరణించారు.  జూన్,2006లో ఆరుగురు ప్రయాణికులతోపాటు 6 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న యతి ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ పై కూలిపోయింది. సెప్టెంబర్,2006లో తూర్పు నేపాల్ లో చార్టెడ్ విమానంపై శ్రీ ఎయిర్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 24 మంది ప్రయాణికులు మరణించారు.

Nepal Plane Crash Incident : నేపాల్ విమాన ప్ర‌మాద ఘటన.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ భార‌త ప్ర‌యాణికుడు

సెప్టెంబర్, 2011లో టూరిస్టులతో వెళ్లిన బీచ్ క్రాఫ్ట్ (1900డి) మౌంట్ ఎవరెస్టు చుట్టూ తిరిగి చూపిస్తుండగా విమానం కొండన ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది మృతి చెందారు. మే, 2012లో ఉత్తర నేపాల్ లో 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న డార్నియర్ విమానం పర్వతం పైభాగాన్ని ఢీకొట్టడంతో 15 మంది చనిపోయారు. మే,2015లో యూఎస్ మెరైన్ కార్ప్స్ స్క్వాడ్రాన్ దేశంలోని చారికోట్ రీజయన్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం నివాసితులు చనిపోయారు. ఫ్రిబవరి, 2016లో 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ కష్టమాన్ డాప్ ఎయిర్ క్రాప్ట్ నేపాల్ లోని కాలికోట్ జిల్లాలో కుప్పకూలింది.

67 మంది ప్రయాణికులతోపాటు నలుగురు సిబ్బందితో వెళ్తోన్న యూఎస్-బంగ్లా ఎయిర్ లైన్ మార్చి12, 2018న నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిబువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కుప్పకూలింది.
ఫిబ్రవరి, 2019లో మేఘావృతమైన వాతావరణం కారణంగా ఖాట్మాండులోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన వైమానిక దళానికి చెందిన ఎయిర్ హెలికాప్టర్ కొండపై కూలిపోయింది. మే, 2022లో థానే నుంచి నలుగురు భారతీయులు సహా 22 మంది ప్రయాణికులతో బయల్దేరిన తారా విమానం నేపాలో ముస్టాగ్ జిల్లాలోని పర్వతాల్లో కుప్పకూలింది.

ట్రెండింగ్ వార్తలు