Netharland Lock Down
Netharlands Lockdown : ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెదర్లాండ్ లో ఈరోజు నుంచి జనవరి 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ఆదివారం ఉదయం 5 గంటల నుంచి జనవరి 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
నిన్నరాత్రి హేగ్ లో అత్యవసరంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదో వేవ్ ప్రభావం నెదర్లాండ్స్ మీద ఉంటుందనే వార్తల నేపధ్యంలో లాక్‌డౌన్ అనివార్యమైందని రుట్టే తెలిపారు. సూపర్ మార్కెట్లు, ఆస్పత్రులు, వైద్యసేవలు, కార్ గ్యారేజీలు వంటి ముఖ్యమైన షాపులు తప్ప మిగిలిన ఇతర షాపులు, అన్ని విద్యా సంస్ధలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్‌లు, మ్యూజియంలు, థియేటర్‌లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. కాగా క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్ లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఓఎమ్టీ సభ్యుడు జాప్ వాన్ డిసెల్ హెచ్చరించారు.
Also Read : Omicron Effect: మహారాష్ట్రలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇప్పటికే డచ్, ప్రాన్స్, సైప్రస్ ఆస్ట్రియా దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను కఠిన తరం చేశాయి. పారిస్ నూతన సంవత్సర వేడుకల బాణాసంచా కార్యక్రమాన్ని రద్దు చేసింది. డెన్మార్క్ లో ఎక్కువ మంది ప్రజలు గూమికూడే సామూహిక ప్రదర్శనలు , కార్యక్రమాలు, సినిమాలు, మ్యూజియంలు, ఉద్యానవనాలను మూసి వేశారు. ఐర్లాండ్ లో పబ్ లు బార్‌ల పై రాత్రి 8 గంటలనుంచి కర్ప్యూ విధించారు.