గురక పెట్టి : నిద్రపోతు డబ్బులు సంపాదించేశాడు

  • Publish Date - February 1, 2019 / 07:21 AM IST

డబ్బులు ఊరికే రావు అనే మాట ఇటీవల అందరూ వాడతున్న మాట. కానీ తెలివితేటలుంటే  సంపాదించటానికి ఎన్నో మార్గాలున్నాయి. సక్రమంగానే లెండి అక్రమంగా కాదు. నెటిజన్స్ కు ఏమాత్రం కొత్తగా కనిపించినా వాటిని తెగ వైరల్ చేసేస్తుంటారు. ఫిదా అయిపోతుంటారు. ఈ క్రమంలో మరో వీడియో నెట్ లో వైరల్ గా మారింది. పిచ్చి పలు విధాలు అంటే ఆ పిచ్చిలో ఇదొకటి అని అనుకోవచ్చు. ఎవరన్నా నిద్రపోతుంటే తదేకంగా చూస్తామా…చూస్తాం కానీ కొద్ది సేపే. అలా నిద్రపోయేవారిని చూసేందుకు డబ్బులు ఇచ్చి మరో మీరెప్పుడన్నా చూశారా..లేదు కదూ..కానీ నెటిజన్స్ మాత్రం నిద్రపోయేవారిని డబ్బులిచ్చి మరీ చూశారు. అంతేనా..దాన్ని వైరల్ చేసేశారు కూడా..

 ఓ వ్యక్తి నిద్రపోతుంటే దాన్ని లైవ్‌లో చూసి తెగ సంతోషపడిపోయారు నెటిజన్స్. ఇది కూడా ఊరికనే కాదండీ..డబ్బులు కూడా చెల్లించడం గమనార్హం. ‘ట్విచ్’ అనే గేమింగ్ వెబ్‌సైట్ విభిన్నమైన వినోదాన్ని అందిస్తూ గేమర్స్‌ని విపరీతంగా  ఆకట్టుకుంటోంది. ఇందులో గేమ్స్ ఆడే వ్యక్తులను లైవ్‌లో చూసే ఫెసిలిటీస్ ని కూడా కల్పించింది. జెస్సీ డి స్ట్రీమ్స్ అనే యూజర్ ఈ వైబ్‌సైట్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ‘జస్ట్ చాటింగ్’ కేటగిరిలో ఉన్న జెస్సీ.. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటాడు. లేదా, టీవీ చూస్తూ ఉంటాడు. కానీ, ఏ రోజూ చాటింగ్ సెషన్‌లో యాక్టివ్‌గా ఉండడు. 

ఈ క్రమంలో ఓ రోజు వెబ్‌సైట్‌లో గేమ్‌ ఆడుతూ లైవ్‌లోనే నిద్రపోయాడు. అలా రెండు గంటల సేపు లైవ్‌లో టెలీకాస్ట్ అవుతునే ఉంది. దీంతో చాలామంది నెటిజన్స్ జెస్సీ డి స్ట్రీమ్స్  నిద్రను చాలా చాలా ఇంట్రెస్ట్ గా చూశారు. అదికూడా డబ్బులు ఇచ్చి. గురక పెడుతూ నిద్రపోతున్న జెస్సీ డి.. మేలుకొని చూసేసరికి ఏకంగా 200 మంది వ్యూవర్స్ డబ్బులు చెల్లించటం కనిపించింది. జెస్సీ డీ ‘‘హాయ్.. వావ్.. ఏమిటదీ?’’ అంటూ ఆనందాశ్చార్యాలకు లోనయ్యారు. ఇలా ఇప్పటివరకు ఈ వీడియోను 26 లక్షల మంది చూశారు. ‘ట్విచ్’ నిబంధనల ప్రకారం లైవ్ స్ట్రీమింగ్‌లో గేమ్స్ ఆడుతూ నిద్రపోకూడదు. జెస్సీ డి నిద్రను చూసేందుకు డబ్బులు చెల్లించిన క్రమంలో అతడికి ఎలాంటి ఫైన్ విధించకపోవడం గమనార్హం. ఆ వీడియోపై మీరుకూడా ఓ లుక్కేయండి.