New coronavirus: కొత్త కరోనా.. గాలి ద్వారా వేగంగా వచ్చేస్తుంది

New coronavirus in Sri Lanka: గాలి ద్వారా వ్యాపించే కొత్తరకం కరోనా వైరస్‌ శ్రీలంకలో ప్రజలను కంగారు పెట్టేస్తుంది. శ్రీలంక అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా వేగంగా.. ముందరికన్నా ఉదృతంగా విస్తరిస్తోంది. గాలిలో ఈ కొత్తరకం వైరస్.. దాదాపు గంటసేపు ఉంటుందని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే వెల్లడించారు.

శ్రీలంక దేశంలో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతోందని, అందుకు కారణం కొత్తగా కనుగొన్న వైరస్ అని అంటున్నారు నిపుణులు. ఈ వేరియంట్ దాదాపు గంటసేపు గాలిలో ఉండగలదని, వేగంగా వ్యాప్తి చెందుతోందని నీలిక మాలావిగే తెలిపారు. కొలంబోలోని ఒక అగ్ర రోగనిరోధక శాస్త్రవేత్త ప్రకారం, శ్రీలంకలో గతంలో కనిపించిన వాటి కంటే బలమైన వైరస్.. గాలిలో కనుగొనబడింది.

ఇంతకుముందు కరోనా వైరస్ కంటే ఎన్నో రెట్లు వేగాంగా వైరస్‌ను వ్యాప్తి చేసే వేరియంట్ గంటసేపు గాలిలో ఉంటుందని విశ్వవిద్యాలయం ఇమ్యునాలజీ మరియు మాలిక్యులర్ సైన్సెస్ విభాగాధిపతి నీలికా మాలావిగే చెప్పారు. COVID-19కొత్త ఒత్తిడిని శ్రీలంక మాత్రమే కాదు, భారతదేశం, పాకిస్తాన్, ఇండోనేషియా వంటి ఇతర ఆసియా దేశాలు కూడా ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సెకండ్ వేవ్ విస్తరణ వేగం గతంలో కంటే వేగంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు