కరోనా “న్యూ వెర్షన్” లక్షణాలు ఇవే

New Covid strain symptoms యూరప్ దేశాలను ఇప్పుడు కొత్త రకం కోవిడ్-19 వణికిస్తోంది. ఈ కొత్త రకం కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త రకం కరోనా ఇప్పుడు బ్రిటన్ ని కలవరపాటుకి గురిచేస్తోంది. బ్రిటన్ లో 1000కి పైగా కేసుల్లో ఈ కొత్త రకం కరోనా వైరస్ కొనుగొబడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. వేగంగా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో బ్రిటన్ లో టైర్-4 లాక్ డౌన్ విధించింది బోరిస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా లండన్, సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో కఠినమైన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. కి్స్మస్ సెలబ్రేషన్స్ పై కూడా ఆంక్షలు విధించారు. బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ నియంత్రణలో లేదని స్వయంగా ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.

దేశంలో కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని బ్రిటన్ ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ఇప్పటి వైరస్ కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందన్నారు. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్‌ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్తరకం వైరస్‌ వల్ల మరణాలు కూడా అంతే తీవ్రంగా పెరుగుతాయా? ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్ లు, ట్రీట్ మెంట్లు పనిచేస్తాయా? అన్నవాటిపై ఇప్పుడేమీ చెప్పలేమని సైంటిస్టులు చెప్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ రూల్స్ ను స్ట్రిక్టుగా ఫాలో అవ్వాల్సిందేనని ఆదివారం బ్రిటన్ హెల్త్ మినిస్టర్ మాట్ హన్ కాక్ స్పష్టం చేశారు.

ఇక ఈ కొత్త రకం వైరస్ లక్షణాల గురించి బ్రిటన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ మాట్లాడతూ…ఇప్పటివరకు కొనుగొనబడిన 1000కేసులకి, ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న వైరస్ లక్షణాలకు ఎలాంటి వ్యత్యాసం లేదు. ఈ రెండు వైరస్ ల లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉన్నాయని విట్టీ అన్నారు.
కోవిడ్-19 లక్షణాలు

ముఖ్యమైన వ్యాధి లక్షణాలు
జ్వరం

పొడి దగ్గు
అలసట
తక్కువ సాధారణంగా కనిపించే వ్యాధి లక్షణాలు
నొప్పులు మరియు బాధలు
గొంతు మంట
విరేచనాలు
కండ్లకలక
తలనొప్పి
రుచి లేదా వాసన శక్తి కోల్పోవడం
చర్మంపై దద్దుర్లు లేదా వేళ్లు లేదా కాలి వేళ్లు రంగు కోల్పోవడం
తీవ్రమైన వ్యాధి లక్షణాలు:
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవడం
ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి
మాట్లాడలేకపోవడం లేదా కదలలేకపోవడం

కొత్త రకం వైరస్ లక్షణాలు కూడా..జ్వరం,దగ్గు,వాసన కోల్పోవడం,గొంతులో నొప్పి లేదా మంట, తీవ్ర అలసట,తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది,ఒళ్లు నొప్పి మరియు బాధ,ఛాతీలో నొప్పి,మాట కోల్పోవడం వంటివే అని తెలిపారు.

ఈ కొత్త రకం వైరస్ పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు వెయ్యి మందిలో దీనిని గుర్తించినట్లు సమాచారం అందినట్లు తెలిపింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కరోనా కంటే భిన్నంగా వ్యవహరిస్తుందడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సంస్థ ఉన్నతాధికారి మైకేల్ ర్యాన్ తెలిపారు. ఇప్పటికే అనేక రకాల కరోనా వైరస్ లను గుర్తించామని తెలిపారు. సమయం గడుస్తున్నకొద్ది వైరస్ రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు.

ఇక, కొత్తరకం కరోనా వైరస్ “నియంత్రణలో లేదు”అని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించడంతో…యూరోపియన్ దేశాలు ఆదివారం నుంచి UKకి విమానాలు,రైళ్ల రాకపోకలపై నిషేధం విధించడం ప్రారంభించాయి. భారత్ కూడా బ్రిటన్ కి విమాన సర్వీసులను నిలిపివేసింది. మరోవైపు, బ్రిటన్ ​లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. ఫైజర్‌ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి లభించగా.. 90 ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు బ్రిటన్ లో 3లక్షల 50 వేల మందికి తొలి డోసు టీకా అందించారు