మార్స్ ల్యాండింగ్ తర్వాత నాసా షేర్ చేసిన పిక్స్

మార్స్ ల్యాండింగ్ తర్వాత నాసా షేర్ చేసిన పిక్స్

Updated On : February 20, 2021 / 10:29 AM IST

Rover Pics From NASA: కొన్ని నెలల పాటు శ్రమించి గురువారం మార్స్ పైకి చేరుకున్న రోవర్ ప్రయోగం విజయవంతం అయింది. అక్కడికి దిగిన తర్వాత రోవర్ కొన్ని సుందరమైన ఫొటోలను షేర్ చేసింది. తొలి పిక్ ను నాసా ప్రెస్ కాన్ఫిరెన్స్ లో శుక్రవారం షేర్ చేశారు. అందులో మార్టియన్ సర్ఫేస్ కు దగ్గరవుతుండగా తీసిన ఫొటో అది. గతంలో ఏ మిషన్ ఇంత అద్భుతమైన ఫొటోలను తీయలేదు.

ఆ ఫొటోను పర్సెవరన్స్ ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేస్తూ.. కిందకు అడుగుపెట్టేముందు గాలిలో ఉండగా తీసిన ఫొటో ఇది అని రాసుకొచ్చారు. కొన్ని సంవత్సరాలుగా మా టీం కన్న కల నెరవేరింది. అద్భుతాలు చేయాలంటే ధైర్యం ఉండాలి.

గాలిలో ఉండగా.. తీసిన జెట్ ఫ్యాక్ ఫొటో ఇది. కేవలం తలానికి 6.5అడుగుల ఎత్తులో తీసింది. ఇంజినీర్ స్పేస్‌క్రాఫ్ట్ కష్టం, మా ఆశ మొత్తం సోలార్ వ్యవస్థను ఓపెన్ చేయాలని. ఈ కలెక్షన్ లో మరో ఐకానిక్ ఇమేజ్ జత చేయాలని అనుకుంటున్నాం. ఇది సాధించగలిగామనే సంతోషంతో ఉన్నాం.

Rover 1

Rover 1

రోవర్ ల్యాండింగ్ సమయంలో హై రిసొల్యూషన్ ఇమేజ్ అక్కడి రాళ్లను కూడా క్లియర్ గా చూపిస్తుంది. మాకు.. డెల్టాకు మధ్య అర్థం చేసుకోవాల్సిన సైన్స్ చాలా ఉంది. త్వరలోనే మార్స్ నుంచి కలర్ ఇమేజ్ వస్తుంది. అప్పుడు మా సైన్స్ టీం మరింత ఫోకస్ చేస్తుంది. మేం మార్స్ తలం మీద సైన్స్ వర్కౌట్ చేస్తామని ముందెప్పుడూ అనుకోలేదు’ అని ఆ మీటింగ్ లో చెబుతున్నారు.

Rover 2

Rover 2

perseverance_descent

perseverance_descent