China Covid : చైనాను వదలబొమ్మాళీ అంటున్న వైరస్.. రోజుకు 4 వేలకు పైగా కేసులు

అటు బీజింగ్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులను ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం చేస్తున్నారన్నంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు చంగ్‌చున్ నగరంతో పాటు జిలిన్ సిటీలోనూ...

Covid Fourth Wave

COVID-19 Infections China : కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో.. వైరస్ తిష్ట వేసుకొని కూర్చుంది. డ్రాగన్‌ను మహమ్మారి వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌ స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. మూడు వారాల క్రితం వంద కేసులు మాత్రమే నమోదవ్వగా.. ఇప్పుడు రోజుకు 4 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే చైనా వాణిజ్య రాజధాని షాంఘైలోని పలు ప్రాంతాల్లో స్ట్రిక్ట్ లాక్ డౌన్ అమలు చేస్తోంది చైనా. 90లక్షల జనాభా కలిగిన మరో నగరం షెన్‌యంగ్‌లోనూ లాక్‌డౌన్‌ విధించింది.

Read More : India Covid-19 : కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం..మార్చి 31 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబందనలు పూర్తిగా ఎత్తివేత

అటు బీజింగ్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులను ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం చేస్తున్నారన్నంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు చంగ్‌చున్ నగరంతో పాటు జిలిన్ సిటీలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాదాపు 45లక్షల జనాభా కలిగిన జిలిన్‌లో 8 టెంపరరీ హాస్పిటళ్లు, 2 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. చైనా కేసుల్లో ఎక్కువ శాతం కేసులు జిలిన్‌ ప్రాంతం నుంచే నమోదవుతున్నాయి.

Read More : Covid Vaccine: భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగనిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి
రష్యా, నార్త్ కొరియా బార్డర్లో ఉండే ఈ ప్రావిన్స్‌లో నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు రెండు రోజులకు ఒకసారి మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు చైనాలో జీరో కోవిడ్ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ వచ్చినప్పటికీ అది సాధ్యం కాదని డ్రాగన్ కొట్టిపారేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో మహమ్మారి కట్టడికి ఇంతవరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ విమాన ప్రయాణాలను, బయటి ప్రపంచంతో సంబంధాలను తగ్గించే దిశగా చైనా ప్రభుత్వం ఆలోచిస్తోంది.