Florida Plane Crash
Plane Crash : ప్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బొంబార్డియర్ ఛాలెంజర్ 600 సిరీస్ కు చెందిన విమానం ఉన్నట్లుండి హైవేపై కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించి చూస్తుండగానే బూడిదైంది. ఈ విమాన ప్రమాదం మూడు రోజుల క్రితం ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో ఈ విమానంలో ఐదుగురు ఉన్నారు. అందులో ఇద్దరు చనిపోగా.. మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read : Plane Crash : కరేబియన్ సముద్రంలో కూలిన చిన్న విమానం…హాలీవుడ్ నటుడు, అతని ఇద్దరు కూతుళ్ల మృతి
విమానం రెండు ఇంజన్లు చెడిపోవటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం నేపుల్స్ మున్సిపల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడానికి రెండు నిమిషాల ముందు పైలట్ రేడియో ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ప్రమాదం గురించి తేలియజేశాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. ఈలోపే హైవే పక్కన విమానం కూలిపోయింది.
విమానం కూలిపోతున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం హైవేపై వాహనాల రద్దీగా ఉన్న సమయంలో వేగంగా కిందికి దూసుకురావడం వీడియోలో చూడొచ్చు. హైవేపై వెళ్తున్న వాహనాలను ఆనుకొని వెళ్తున్నట్లుగా కనిపించింది.. హైవే పక్కన విమానం కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు రావడం, విమానం మొత్తం కాలిపోవటం క్షణాల్లో జరిగిపోయింది.
WATCH: New video shows Friday's plane crash on I-75 in Naples, Florida pic.twitter.com/M8EvNtgcxv
— BNO News (@BNONews) February 12, 2024