2020లోకి అడుగుపెట్టిన తొలి రెండు దేశాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే ముందే ఆ దేశం 2020లో అడుగుపెట్టేసింది. ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. 2019కి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తొలి దేశంగా సమోవా (Samoa) నిలవగా, ఆ తర్వాత న్యూజిలాండ్, అక్లాండ్ 2020 సంవత్సరానికి స్వాగతం పలికాయి.
న్యూజిలాండ్ దేశ పౌరులంతా సాంప్రదాయక పద్ధతిలో మ్యూజిక్, డ్యాన్స్ లతో కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పారు. ఆకాశంలో ఫైర్ వర్క్స్ కాలుస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగితేలారు. ప్రపంచంలో స్థానిక కాలమానం ప్రకారం.. (10AM GMT) కొత్త దశబ్దంలోకి ముందుగా అడుగుపెట్టిన తొలి దేశం సమోవా (Samoa) కాగా, ఆ తర్వాత న్యూజిలాండ్ 2020లోకి అధికారికంగా అడుగుపెట్టి రెండో స్థానంలో నిలిచింది.
దక్షిణ పసిఫిక్ వ్యాప్తంగా న్యూ ఇయర్ పార్టీలతో ఫైర్ వర్క్స్ తో ఆకాశమంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. న్యూజిలాండ్‌లో 13 గంటలకు ముందుగానే దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ పార్టీలు వేడుకలు మొదలయ్యాయి. ప్రధాన నగరాల్లోని వీధులన్నీ ఫైర్ వర్క్స్‌తో పండు వెన్నలలా వెలిగిపోతున్నాయి.
కొద్ది క్షణాల్లో 2020 కొత్త ఏడాది వస్తుందనగా.. అక్లాండ్ లోని నగరవాసులంతా కౌంట్ డౌన్ చెబుతూ వెల్ కమ్ చెప్పారు. 2019లో ఎన్నో విషాదకరమైన సంఘటనలను ఎదుర్కొన్న తర్వాత వస్తున్న సంవత్సరం కావడంతో ఈ ఏడాది అంతా బాగుండాలని న్యూజిలాండ్ వాసులంతా దేవున్నీ ప్రార్థిస్తున్నారు.