costly sandwich : వరల్డ్ రికార్డ్ సాధించిన ఆ శాండ్ విచ్ ధర వింటే అదిరిపడతారు

ఏదైనా ప్రత్యేకత ఉంటేనే అవి ప్రపంచ రికార్డులు సాధిస్తాయి. ఓ శాండ్‌విచ్ ధర వింటే అయ్య బాబోయ్ అంటారు. కానీ అది అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. ఇంతకీ ఆ కాస్ట్లియెస్ట్ శాండ్‌విచ్ ఎక్కడ దొరుకుతుంది? అంటే..

 costly sandwich @ new york restaurant

costly sandwich:  సాధారణంగా దొరికే శాండ్‌విచ్ ధర 40 రూపాయలు ఉంటుందేమో. కానీ న్యూయార్క్ రెస్టారెంట్ లో (new york restaurant) శాండ్‌విచ్ (sandwich) ధర చెబితే కింద పడిపోతారు. అది మామూలు శాండ్‌విచ్ కాదు.. అంత స్పెషల్ ఏంటి అంటారా? అంత స్పెషల్ కాబట్టే గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో పేరు నమోదు చేసుకుంది. దాని ధర, వివరాలు చదవండి.

Josephine Michaluk : 96 లీటర్లు రక్తాన్ని దానం చేసిన 80 ఏళ్ల బామ్మ .. మానవత్వాన్ని వరించిన గిన్నిస్‌ రికార్డు

న్యూయార్క్ రెస్టారెంట్ ప్రపంచంలోనే ఖరీదైన శాండివిచ్ తయారీని ప్రారంభించింది. ధర చూసి అయ్య బాబోయ్ అనుకునేరు. అంత స్పెషల్ ఉంటేనే కదా ధర పలికేది. ‘క్వింటెసెన్షియల్ గ్రిల్డ్ చీజ్ శాండ్ విచ్’ (Quintessential Grilled Cheese) గా పిలవబడే దీని ధర 17,500 రూపాయలు మాత్రమే. అయితే ఈ శాండ్‌విచ్‌ను అలా ఆర్డర్ ఇవ్వగానే ఇలా ఇచ్చేస్తారు అనుకుంటే పొరపాటు. 48 గంటల ముందుగా ఆర్డర్ ఇవ్వాలట.  ప్రత్యేకంగా తయారు చేసిన చీజ్ ద్వారా ఈ శాండ్‌విచ్ తయారు చేస్తారు. ఇక  దీని తయారీ విధానం మొత్తం వివరంగా రెస్టారెంట్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది వైరల్ గా‌మారింది.

Rajasthan Man: సైకిల్‌పై దేశయాత్ర.. గిన్నిస్ రికార్డుల్లో చోటు.. ఇంతకీ అతడు ఏం సాధించాడంటే

గిన్నిస్ వరల్డ్ రికార్డులో (guinness world record) పేరు నమోదు చేసుకున్న ఈ శాండ్‌విచ్ తయారీ మాత్రమే కాదు.. సర్వ్ చేసే విధానం కూడా పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి ఉన్న ఆ ప్రత్యేకత వల్లే ప్రపంచ రికార్డు సాధించింది. ఇక ఈ క్లాస్ట్లీ శాండ్ విచ్ తినాలంటే మాత్రం రెండురోజుల ముందు ఆర్డర్ చేసుకోవడం గుర్తుంచుకోవాల్సిన విషయం.