Rajasthan Man: సైకిల్‌పై దేశయాత్ర.. గిన్నిస్ రికార్డుల్లో చోటు.. ఇంతకీ అతడు ఏం సాధించాడంటే

రాజస్థాన్‌, బర్మర్ జిల్లాకు చెందిన నర్పాత్ సింగ్ రాజ్‌పురోహిత్ జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వరకు సైకిల్‌పై యాత్ర చేశాడు. జనవరి 2019లో మొదలైన అతడి యాత్ర 2022 ఏప్రిల్ వరకు సాగింది. మూడేళ్లకుపైగా అతడి యాత్ర సాగింది. సైకిల్‌పై దేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించిన వ్యక్తిగా రాజ్ పురోహిత్ చరిత్ర సృష్టించాడు.

Rajasthan Man: సైకిల్‌పై దేశయాత్ర.. గిన్నిస్ రికార్డుల్లో చోటు.. ఇంతకీ అతడు ఏం సాధించాడంటే

Updated On : March 13, 2023 / 9:10 PM IST

Rajasthan Man: రాజస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. దేశంలోనే అత్యధిక దూరం సైకిల్ రైడ్ చేసిన వ్యక్తిగా అతడికి సర్టిఫికెట్ జారీ చేసింది. రాజస్థాన్‌, బర్మర్ జిల్లాకు చెందిన నర్పాత్ సింగ్ రాజ్‌పురోహిత్ జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వరకు సైకిల్‌పై యాత్ర చేశాడు.

UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..

జనవరి 2019లో మొదలైన అతడి యాత్ర 2022 ఏప్రిల్ వరకు సాగింది. మూడేళ్లకుపైగా అతడి యాత్ర సాగింది. సైకిల్‌పై దేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించిన వ్యక్తిగా రాజ్ పురోహిత్ చరిత్ర సృష్టించాడు. అతడు సైకిల్‌పై మొత్తం ప్రయాణించిన దూరం 30,121 కిలోమీటర్లు. మూడేళ్లు, దేశంలోని 29 రాష్ట్రాల మీదుగా అతడి యాత్ర సాగింది. కోవిడ్ కారణంగా 2020లో అతడి యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పట్లో లాక్ డౌన్ సమయంలో తమిళనాడులోనే నాలుగు నెలలపాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బిస్కెట్లు మాత్రమే తిని మనుగడ సాగించినట్లు అతడు చెప్పాడు. అంతేకాదు.. తన ప్రయాణంలో మొత్తం 93,000 మొక్కల్ని నాటినట్లు వెల్లడించాడు.

Delhi MLAs: ఢిల్లీ ఎమ్మెల్యేలకు 66 శాతం పెరిగిన జీతాలు.. నెలకు ఎంతొస్తుందో తెలుసా..

ప్రయాణ సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు వివరించాడు. తీర ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు తేమ కారణంగా తీవ్రమైన చెమట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లినట్లు, అక్కడి విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి నాటించినట్లు చెప్పాడు. 1500 చోట్ల స్థానిక ప్రజలతో సమావేశమై, పర్యావరణం గురించి వివరించినట్లు వెల్లడించాడు. అతడి ప్రయాణాన్ని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు అతడికి దీనికి సంబంధించిన సర్టిఫికెట్ పంపించారు.