UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..

చేతిలో మొబైల్ ఉంటే చాలు.. డబ్బున్నట్లే. యూపీఐ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వెంటనే చెల్లించవచ్చు. అవసరమైన వారికి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో డబ్బు పంపొచ్చు. కానీ, యూపీఐ పేమెంట్స్ విషయంలో పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. డైలీ లిమిట్ దాటితే పేమెంట్ చేయలేరు.

UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..

UPI Payment Limit: మనీ ట్రాన్సాక్షన్స్‌ను యూపీఐ పేమెంట్స్ సులభతరం చేసిన సంగతి తెలిసిందే. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. డబ్బున్నట్లే. యూపీఐ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా వెంటనే చెల్లించవచ్చు. అవసరమైన వారికి ఎంత దూరంలో ఉన్నా క్షణాల్లో డబ్బు పంపొచ్చు.

Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి.. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి

కానీ, యూపీఐ పేమెంట్స్ విషయంలో పరిమితి ఉన్న సంగతి తెలిసిందే. డైలీ లిమిట్ దాటితే పేమెంట్ చేయలేరు. చాలా మంది ఈ సమస్యను ఏదో ఒక రోజు ఎదుర్కొనే ఉంటారు. డైలీ పేమెంట్స్ లేదా ట్రాన్స్‌ఫర్ లిమిట్ దాటిపోతే ఆ రోజు ఈ సమస్య ఎదురవుతుంది. అయితే, ఈ లిమిట్ అందరికీ ఒకేలా ఉండదు. ఎందుకంటే బ్యాంకును బట్టి యూపీఐ పేమెంట్స్ లిమిట్ మారుతుంది. ఒక్కో బ్యాంకు లిమిట్ ఒక్కోలా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం.. ఒక యూపీఐ అకౌంట్‌కు అనేక బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గరిష్టంగా యూపీఐ ద్వారా ఒక రోజుకు లక్ష రూపాయలు మాత్రమే పంపొచ్చు.

అది కూడా అన్ని బ్యాంక్ అకౌంట్స్‌కు కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిట్ రోజుకు రూ.1 లక్ష. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిట్ కూడా రూ.1 లక్ష. అయితే, కొత్త కస్టమర్లు రూ.5,000 మాత్రమే పంపొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ అయితే రోజుకు రూ.10,000 మాత్రమే పంపొచ్చు. అదే గూగుల్ పే ద్వారా అయితే, ఈ లిమిట్ రూ.25,000గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ పరిమితి రూ.1 లక్ష. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిమితి రూ.25,000.