Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి.. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి

వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఖమ్మం జిల్లా పుటాని తండాలో ఈ ఘటన జరిగింది. పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారిగా వీధి కుక్కలు దాడి చేశాయి.

Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై కుక్కల దాడి.. ఆస్పత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి

Dogs Attack: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఖమ్మం జిల్లా పుటాని తండాలో ఈ ఘటన జరిగింది.

Fire Accident: ముంబై మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 20 షాపులు దగ్ధం

పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బానోత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వాళ్లు స్పందించి కుక్కల్ని తరిమికొట్టారు. గాయాలపాలైన బానోత్‌ను కుటుంబ సభ్యులు సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని ఖమ్మం నుంచి బస్సులో హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో, బస్సులోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల్ని కట్టడి చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో కుక్కల దాడి ఘటనలు ఐదు జరిగాయి. కాగా, ఇటీవల హైదరాబాద్, అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.