Fire in Maldives 9 Indians killed
Fire in Maldives 9 Indians killed : మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్దీవుల రాజధాని నగరం అయిన మేల్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది భారతీయులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి అని సమాచారం . ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మేలేలోని రద్దీ ప్రాంతంలో గురువారం (నవంబర్ 10,2022)విదేశీ కార్మికులు నివాసముండే ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయలు మృతి చెందారు. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో వెహికల్ రిపేర్ గ్యారేజీ ఉందని.. అందులో మంటలు చెలరేగి పై అంతస్తు వరకు పాకాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికితీశామని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.