Sri Lanka : ‘నాకు ఇల్లే లేదు..మరి ఇంటికెలా వెళ్తా? ఎక్కడికెళ్తా? : అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే

‘నాకు ఇల్లే లేదు..మరి ఇంటికెలా వెళ్తా? ఎక్కడికెళ్తా? ఇల్లు లేనప్పుడు ఇంటికెళ్లమని డిమాండ్ చేయటంలో అర్థంలేదు..ఇటువంటివి మానుకోండి అంటూ నిరననకారుల డిమండ్లను కొట్టిపారేశారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.

Sri Lanka’s President Ranil Wickremesinghe  : శ్రీలంకను సర్వనాశనం చేసి గొటబాయ రాజపక్సా దేశం వదలిపోయాక..శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కానీ రణిల్ కూడా అధ్యక్షుడికి ఉండకూడదని కొంతమంది నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రణిల్ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం (జులై 31,2022) ఓ కార్యక్రమంలో రణిల్ మాట్లాడుతూ..తనదైన శైలిలో నిరసనకారులకు సమాధానం ఇచ్చారు. ‘నాకు ఇల్లే లేదు..ఇల్లే లేనప్పుడు ఇంటికి వెళ్లమని డిమాండ్ చేయటంలో అర్థం లేదు’అన్నారు. ఈ సందర్భంగా తన ఇంటిని దహనం చేసిన విషయాన్ని ఆందోళనకారులకు గుర్తుచేశారు.

ఇంకా రణిల్ మాట్లాడుతూ..నేను ఇంటికి వెళ్లిపోవాలంటూ చేసే నిరసనలు ఆపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కోరారు. ఎందుకంటే నేను వెళ్లడానికి నాకంటూ ఇల్లు లేదు. ఇల్లు లేని వ్యక్తిని ఇంటికి వెళ్లమనడంలో అర్థం లేదు. నా ఇంటిని పునర్నిర్మించిన తర్వాత ఈ డిమాండ్ చేయండి అంటూ ఆసక్తికరంగా సూచించారు.నిరసనకారులు తమ ఆందోళనలతో ధ్వంసం చేసినవాటిని తిరిగి నిర్మించాలని ఈ దేశాన్ని..నా ఇంటిని పునర్నిర్మించాలి’ అంటూ తన నియామకంపై వస్తోన్న నిరసనలను తిప్పికొట్టారు.

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న దేశాన్ని ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయటానికి నా శాయ శక్తుల కృషి చేస్తున్నానని తెలిపారు.దాని కోసం ఐఎంఎఫ్‌తో ఒప్పందం చేసుకుంటున్నామని కానీ ఇది ఆలస్యం అవుతోందని తెలిపారు. దేశంలో ఆహార, ఇంధన కొరత వల్ల కొనసాగుతున్న నిరసనలతో ఐఎంఎఫ్‌తో సంప్రదింపులు నిలిచిపోయాయని అన్నారు. ఐఎంఎఫ్ పూర్తిగా ఈ సమస్యను పరిష్కరించదు. కాబట్టి, రుణాలు చెల్లింపునకు శ్రీలంక పరిష్కారం వెతుక్కోవాల్సి ఉంటుందని.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని పార్టీలు సమష్టిగా పనిచేయాలి’ అని సూచించారు.

అధ్యక్షుడిగా (ప్రస్తుతం మాజీ) ఉన్న గొటబాయ రాజపక్సను పదవి నుంచి దించి దేశం వదిలిపోయేలా లంకేయులు నిరసనలతో హోరెత్తించారు. గొటబాయపై తీవ్ర ఆగ్రహంతో మండిపడ్డ ప్రజలు అధ్యక్ష భవనంలోకి చొరబడి నిరసనలు తెలిపారు. కానీ నాటి ప్రధానిగా ఉన్న విక్రమసింఘేపై కూడా పడింది. దీంతో కొంతమంది ఆందోళనకారులు ఆయన ఇంటిని దహనం చేశారు. తనకున్న ఒకేఒక్క ఇంటిని దహనం చేశారని..రణిల్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని నిరసనకారులకు రణిల్ గుర్తు చేశారు. నాకు ఇల్లే లేదు..మరి ఇల్లేలేనప్పుడు నేను ఎక్కడికెళ్లాలి? ఇటువంటి డిమాండ్స్ అర్థం లేనివి అంటూ కొట్టిపారేశారు.

 

ట్రెండింగ్ వార్తలు