కరోనా వైరస్ ఎఫెక్ట్ : విమానాల్లో భోజనం, కాఫీ, టీ, బ్లాంకెట్స్, మేగజైన్స్ బంద్

  • Publish Date - January 29, 2020 / 02:35 PM IST

కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు. 

విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ్వటం మానేసాయి. corona virus వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విమాన ప్రయాణికులు వారి సొంత వాటర్ బాటిళ్లు, ఆహారం, తెచ్చుకోవాలని తైవాన్ కు చెందిన చైనా ఎయిర్ లైన్స్ ప్రకటించింది. 

corona virus బారినపడి దేశంలో 130 మందికి పైగా మృత్యువాత పడటంతో సిబ్బందిని, ప్రజలను రక్షించేందుకు విమానయాన సంస్ధలు  జాగ్రత్త చర్యలు చేపట్టాయి. చైనా ఎయిర్ లైన్స్ దాని అనుబంధ సంస్ధ మాండరిన్ ఎయిర్ లైన్స్ లో కూడా భోజనం ఇవ్వటం మానేశాయి. హంకాంగ్ రూటులో తిరిగే విమానాల్లో టేబులు క్లాత్ లు, న్యాప్ కిన్ లకు బదులుగా పేపరు తువ్వాళ్లను ఇస్తున్నారు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ వాటిని కూడా ఇవ్వటంలేదు.

ప్రయాణ సమయంలో డిస్పోజబుల్ హెడ్ ఫోన్లను ప్యాసింజెర్స్ అడిగినప్పుడు మాత్రమే ఇస్తున్నారు. సీట్ల వెనుక ఉండే పాకెట్ బ్యాగ్ లో కేవలం విమాన ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ మాత్రమే ఉంచుతున్నామని టైగర్ ఎయిర్ తైవాన్ కు చెందిన అధికారి చెప్పారు. విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ అమ్మకాలను నిలిపివేశారు. 

చైనా నుండి తిరగి వచ్చే అన్నివిమానాలలోనూ…దూర ప్రయాణం చేసే విమానాల్లోనూ…..కాక్ పిట్ లు, ప్రయాణికుల క్యాబిన్లలో థాయ్ ఎయిర్ వేస్ క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తోంది. విమానంలో సీటు ముందు ఉండే ఎల్‌సిడి స్క్రీన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని….ప్రతి విమానాన్నిబయలుదేరే ముందు పూర్తి స్థాయిలో శుభ్రపరుస్తాము” అని థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. 

నెల, రెండు నెలలపాటు చైనాకు విమాన సర్వీసులను నిలిపి వేయాలని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్ హానెస్టీ తన FACEBOOK లో  పోస్ట్ చేశాడు. దీనివల్ల దేశ ఆర్ధికవ్యవస్థ ఏమీ దెబ్బతినదని దీనికంటే ప్రజల జీవితం ముఖ్యమని వ్యాఖ్యానించాడు. 

Singapore Airlines, Hong Kong Airlines కు చెందిన Cathay Pacific ఫ్లయిట్లతో సహా ఇతర విమానయాన సంస్ధలు చైనా వెళ్లే విమానాల్లోని తమ సిబ్బందిని మాస్కులు ధరించమని చెపుతున్నాయి. American Airlines  చైనాకు వెళ్లే అన్ని విమనాల్లోనూ corona virus  వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోటానికి శానిటైజర్లను అందిస్తోంది. కొన్ని దేశాలు చైనాకు విమాన సర్వీసులను రద్దు చేశాయి.

చైనాలో  corona virus కారణంగా దక్షిణ కొరియాకు చెందిన ఎయిర్ సియోల్  చైనాకు అన్ని  సర్వీసులను  నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  డిమాండ్ తగ్గిపోవటంతో యూఎస్ నుంచి  బీజింగ్, హాంకాంగ్, షాంఘైలకు తిరిగే విమానాలను ఫిబ్రవరి 1నుంచి 8 వరకు నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ ఎయిర్ లైన్స్  ప్రకటించింది.