కరోనా వైరస్‌ని చైనాలో పుట్టించారు.. నోబెల్ గ్రహీత సంచలన వ్యాఖ్యలు

  • Publish Date - April 19, 2020 / 07:58 AM IST

చైనాలోని ఒక ప్రయోగశాలలో కరోనావైరస్ తయారు చేసినట్లుగా నోబెల్ గ్రహీత లూక్ మోంటాగ్నియర్ ఆరోపించారు. CNEWS కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కరోనావైరస్ అడవి జంతువుల నుండి వుహాన్ తడి మార్కెట్‌కు వెళ్లిందని తాను నమ్మట్లేదని ఆయన అన్నారు. ఇది అసాధ్యం అన్నారు.

వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు వచ్చిందని మోంటాగ్నియర్ అన్నారు. వూహన్‌లోని ప్రయోగశాల 2000సంవత్సరం నుంచి కరోనావైరస్‌లు తయారు చెయ్యడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు చెప్పారు. 

తన సహోద్యోగి, గణిత శాస్త్రజ్ఞుడు జీన్-క్లాడ్ పెరెజ్‌తో కలిసి, అతను కొత్త రకం కరోనావైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించినట్లు వెల్లడించారు. మానవ రోగనిరోధక శక్తికి సంబంధించిన వైరస్ భాగాన్ని ఈ జన్యువులో చేర్చారని ఆయన అన్నారు. 2008లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు మోంటాగ్నియర్.

చైనాలోని వుహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్‌కి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ తయారుచేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టిందని ఆయన అన్నారు. మోంటాగ్నియర్‌కి ఎయిడ్స్ వైరస్ ఎలా ఉంటుందో అందులో ఉండే జన్యువులు ఏంటో పూర్తిగా తెలుసు.

కరోనా వైరస్ జన్యువుల్లో ఎయిడ్స్ (హ్యూమన్ ఇమ్యునో వైరస్ – HIV) మూలకాలు, మలేరియా జెర్మ్ ఉన్నట్లు చెప్పారు. అందువల్లే ఈ వైరస్ సహజంగా పుట్టినట్లు తనకు అనిపించట్లేదని అన్నారు. సార్స్ వైరస్‌లో జన్యువులు, HIVలో జన్యువులు కలిపి ఈ వైరస్‌ని తయారు చేసి ఉండొచ్చనే వాదనకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. 

కరోనా వైరస్‌కి చాలా వరకు చెక్ పెడుతున్నది మలేరియాని తరిమేసే డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్. మలేరియా క్రిమి ఉండడం కారణంగానే అది ఆ మందు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. చైనా కూడా ఈ వైరస్‌కి చెక్ పెట్టేందుకు జనవరిలో ఎయిడ్స్‌ని అరికట్టేందుకు వాడే మందులను వాడింది. దీంతో మొంటాగ్నియర్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. 

అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ల్యాబ్ నుంచి వైరస్ వ్యాపించింది అనేందుకు ఆధారాలు లేవని చెప్పింది.