North Korea : రంగంలోకి కిమ్.. ఒకేసారి 10 మిసైళ్ల ప్రయోగం..

North Korea : ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి సముద్రం వైపు క్షిపణులు ప్రయోగించింది. ఉత్తరకొరియా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయని దక్షిణ కొరికా సైన్యం, జపాన్ ప్రభుత్వం ధ్రువీకరించాయి.

North Korea

North Korea : పశ్చిమాసియాలో పరిస్థితులు ఎంత మాత్రమూ కుదుటపడట్లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతూనే ఉంది. టెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, టెల్‌అవీవ్ యుద్ధ విమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఎఫెక్ట్ ప్రపంచంలోని పలు దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

Also Read : Iran vs Israel War : ‘ఖర్గ్ ఐలాండ్‌’పై అమెరికా సైన్యం ఎటాక్.. ఇది శాంపిల్ మాత్రమే.. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

శనివారం ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి సముద్రం వైపు క్షిపణులు ప్రయోగించింది. ఉత్తరకొరియా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరికా సైన్యం, జపాన్ ప్రభుత్వం ధ్రువీకరించాయి. దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ వారి వార్షిక సైనిక విన్యాసాలు ఫ్రీడమ్ షీల్డ్ నిర్వహిస్తున్న సమయంలో ఉత్తర కొరియా జరిపిన ఈ తాజా పరీక్ష చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర కొరియా బాలిస్టిక్ ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్‌ఆప్ స్టాప్ వెల్లడించారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు స్థానిక సమయం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సముద్రంలో పడిపోయినట్లు జపనీస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉంటే.. జనవరి 27న ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపు అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే.