North Korea president Kim Jong Un : ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు,ఇచ్చే ఆదేశాలు, విధించే శిక్షలు అన్ని అన్నీ సంచలనాలే కాదు వివాదాలకు కేంద్రంగా ఉంటాయి. తన దేశ ప్రజలు ధరించే దుస్తులు, హెయిర్ స్టైల్స్, వారి బిడ్డలకు పెట్టుకునే పేర్లు కూడా కిమ్ చెప్పినట్లే జరగాలి. ఆఖరికి దేశ ప్రజలు నవ్వాలో ఏడవాలో కూడా కిమ్ ఆదేశాలతోనే జరగాలి. నవ్వకూడదంటే నవ్వకూడదు అంతే. లేదంటే తప్పవు కఠిన శిక్షలు ఇటువంటి కఠిన పాలన బహుశా ప్రపంచంలో కిమ్ మాత్రమే చేస్తాడనేలా ఉంటాయి ఆ దేశంలో..
క్షిపణి ప్రయోగాలతో అమెరికాలాంటి దేశాలకు కూడా వార్నింగ్ లు ఇచ్చే కిమ్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం పెద్దగా బయటకు రావు. రాకూడదు కూడా..కిమ్ గురించి అతని కుటుంబం గురించి వివరాలు పెద్దగా తెలియవు. తెలుసుకోవాలని ఎవరైనా ఆదేశ ప్రజలు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవు.ఇది ఎన్నో సందర్భంగా నిరూపించబడింది కూడా.
Kim Jong Un : అమెరికాకు కిమ్ వార్నింగ్..అణు యుద్ధానికి మేము సిద్ధమే
ఇంతటి నియంత పాలన చేసే కిమ్ ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వస్తుంటాయి. ఈక్రమంలో కిమ్ అధిక బరువుతో బాధపడుతున్నారని తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ ఆరోగ్య ఇబ్బందులతో కిమ్ నిద్రపోవటంలేదంటూ ఓ కథనం వచ్చింది. కిమ్ 140 కిలోల బరువుతో ఇబ్బందులు పడతున్నారని..మద్యం, నికోటిన్ వ్యవసనాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీస్(NSA) వెల్లడించింది. దీంతో ఉత్తరకొరియా అధికారులు కిమ్ సమస్యలకు చికిత్స కోసం కసరత్తులు చేస్తున్నారట..
ఈ ఇబ్బందుల వల్ల కిమ్ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారని..ఉత్తర కొరియా అధికారులు కిమ్ సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్య సమాచారం తెలుసుకునే పనిలో పడ్డారని ఎన్ఐసీ ఇచ్చిన సమాచారాన్ని దక్షిణ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ మెంబర్ యూసాంగ్ బూమ్ మీడియాకు తెలిపారు.
Kim Jong-un : కిమ్ మరో వింత నిర్ణయం : పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశం
కిమ్ విదేశీ సిగిరెట్లు, మద్యంతో పాటు తీసుకునే స్నాక్స్ ను ఉత్తరకొరియా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుందని వెల్లడైంది. వీటిని వాడినందు వల్లే కిమ్ దీని కోసం కిమ్ తాజా చిత్రాలను కృత్రి మేథతో విశ్లేషించగా ఆయన అధికంగా బరువు పెరిగారని గుర్తించారట. దాదాపు ఇటువంటి సమాచారంతో అమెరికాకు చెందిన ఓ పత్రికలో వచ్చిన కథనం కిమ్ జోల్పిడెం వంటి ఔషధాలు వాడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం కిమ్ బరువు 140కిలోలు ఉందట. ఈ బరువుతో వచ్చిన సమస్యలతోను కిమ్ తీసుకునే ఆల్కాహాల్ వంటితో నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారట ఉత్తర కొరియా నియంత.
Kim Jong Un : నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష