Kim Jong Un : నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష

నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష విధించింది ప్రభుత్వం. కిమ్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో చదవిన ఓ గూఢాచారి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రభుత్వానికి చెందిన టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజెంట్లు సెన్సార్ చేయని ఇంటర్నెట్ కంటెంట్ ను అక్రమంగా యాక్సెస్ చేస్తూ పట్టుబడడ్డారు. ఇంకేముంది? ఇది దేశద్రోహం కింద జమకట్టింది కిమ్ ప్రభుత్వం. ఈ ఏజెంట్లలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది.

Kim Jong Un : నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష

Kim Jong Un executes state's own spy for Googling him

Kim Jong Un : నార్త్ కొరియా నియంత..నరకాసురుడు ఇలా కిమ్ గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కిమ్ కుటుంబం నియంత పాలనతో దేశంలో ప్రజలు బానిసల్లా బతుకుతున్నారు. తనదేశ ప్రజలు ఏం తినాలో..ఎటువంటి దుస్తులు ధరించాలో..ఏం చూడాలో.. ఏం చూడకూడదో..ఎటువంటి పేర్లు పెట్టుకోవాలో ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్ తో ఉండాలో కూడా శాసిస్తాడీ నియంత. దేశం సంక్షోభంలో కొట్టుకుపోతున్నా కిమ్ కుటుంబం మాత్రం విలాసాలతోనే జీవిస్తారు. దేశంలో ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్నా..ప్రజలు ఆకలిలతో అలమటించిపోతున్నా..వరుస క్షిపణి ప్రయోగాలు కొనసాగిస్తే హడలెత్తిస్తున్నాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కిమ్ జోంగ్-ఉన్ గురించి గూగుల్‌లో చదివినందుకు ఉత్తర కొరియా సీక్రెట్ ఏజెన్సీకి చెందిన అధికారిని ఆ దేశ సైన్యం ఉరితీసింది.

Laughing Banned in NorthKorea :దటీజ్ కిమ్..ఉత్తరకొరియాలో ప్రజలు నవ్వొద్దు, తాగొద్దు,వేడుకలు చేసుకోవద్దు..

Kim Jong Un: కిమ్ సరికొత్త రూల్.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే ..

కిమ్ గురించి తెలుసుకోవటానికి గూగుల్ లో చదవిన ఓ గూఢాచారి (ఇంటిలిజెన్స్)ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రభుత్వానికి చెందిన టాప్ సీక్రెట్ బ్యూరో 10కి చెందిన పలువురు ఏజెంట్లు సెన్సార్ చేయని ఇంటర్నెట్ కంటెంట్ ను అక్రమంగా యాక్సెస్ చేస్తూ పట్టుబడడ్డారు. ఇంకేముంది? ఇది దేశద్రోహం కింద జమకట్టింది కిమ్ ప్రభుత్వం. ఈ ఏజెంట్లలో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది కిమ్ ప్రభుత్వం. ఇక మిగిలినవారిని (అధికారులు) ఆయా పదవుల నుంచి తీసివేసింది. తోటి ఏజెంట్ ద్వారా స్టేట్ పెక్యూరిటీ మంత్రిత్వశాఖకు పంపబడిన అనేకమంది గూఢాచార ఏజెంట్లలోని (ఇంటిలిజెన్స్) ఓ ఏజెంట్ కు మరణశిక్ష విధించబడింది.‘సన్యాసి రాజ్యం’ అని పిలవబడే ఉత్తరకొరియాలో అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయలేరు. బ్యూరో 10 అధికారి అధ్యక్షుడు కిమ్ గురించి గూగుల్ లో శోధించిన వెంటనే వారి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!

ఉత్తర కొరియాలోని మానవ హక్కుల కమిటీ డైరెక్టర్ గ్రెగ్ స్కార్లాటోయు మాట్లాడుతూ..ఇంటర్నెట్ యుగంలో బయటి సమాచారాన్ని నిరోధించడానికి పోరాడుతున్న దేశంపై పట్టు నెమ్మదిగా సడలుతోందనడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. కిమ్‌ పాలనలో అత్యంత విశ్వసనీయ ఏజెంట్లు కూడా ఇప్పుడు బయటి ప్రపంచం నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Kim Jong-un : కిమ్ మరో వింత నిర్ణయం : పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశం

బలవంతం, శిక్ష, నిఘా, సమాచార నియంత్రణ ద్వారా కిమ్‌ కుటుంబం అధికారంలో కొనసాగుతోందని..బయటి ప్రపంచం నుంచి దేశంలోకి ప్రవేశించే సమాచారం పాలనకు ముప్పుగా భావిస్తున్నారని అన్నారు. కానీ ఎంతటి నియంతకు అయినా పతనం తప్పదని..ఇలా ప్రజలను అంతులేని ఆంక్షల చట్రంలో నిర్భంధిస్తు నియంత్ర కిమ్ కు ఏదోక రోజు వారి కుటుంబ పాలన అంతం అవ్వక తప్పదన్నారు. కానీ ఇది అంత సులువు కాదని తెలిసిందే.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

Kim Jong Daughter ‘Ju-ae’ : కిమ్ జోంగ్ కూతురు ‘జు-యే’ అనే పేరు ఎవ్వరు పెట్టుకోకూడదు..ఉంటే పేరు మార్చుకోవాలని నార్త్ కొరియా ప్రభుత్వం ఆదేశం

North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

North Korea: పువ్వులు పూయించలేదని తోటమాలీలను జైల్లో పెట్టిన కిమ్