Kim Jong Daughter ‘Ju-ae’ : కిమ్ జోంగ్ కూతురు ‘జు-యే’ అనే పేరు ఎవ్వరు పెట్టుకోకూడదు..ఉంటే పేరు మార్చుకోవాలని నార్త్ కొరియా ప్రభుత్వం ఆదేశం

నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un)వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ప్రతిదీ సంచలనమే. ప్రజలు ఎటువంటి దుస్తులు ధరించాలో..ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో కూడా శాసించే డిక్టేటర్..అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్రయోగాలతో శతృదేశాలను హడలెత్తించే కిమ్.. తాజాగా తన దేశ ప్రజలకు మరో హుకుం జారీ చేశారు. అదే తన ముద్దుల కూతురు పేరు ‘ జు-యే’ అనే పేరు ఎవ్వరికి ఉండకూడదని ఎవ్వరు పెట్టుకోకూడదని హుకుం జారీ చేశారు నార్త్ కొరియా కిమ్ జోంగ్ ఉన్. ఇప్పటికే ఆ పేరు ఉంటే వారి పేర్లు మార్చుకోవాలని..ఆదేశించారు.

Kim Jong Daughter ‘Ju-ae’ : కిమ్ జోంగ్ కూతురు ‘జు-యే’ అనే పేరు ఎవ్వరు పెట్టుకోకూడదు..ఉంటే పేరు మార్చుకోవాలని నార్త్ కొరియా ప్రభుత్వం ఆదేశం

North Korea is banning girls from having the same name as president Kim Jong Un's daughter

Kim Jong-un’s daughter ‘Ju-ae’ : నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un)వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు.. ప్రతిదీ సంచలనమే. ప్రజలు ఎటువంటి దుస్తులు ధరించాలో..ఆఖరికి ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలో కూడా శాసించే డిక్టేటర్..తమ వంశస్తుల ఫోటోలను ప్రతీ ఒక్కరి ఇళ్లల్లో పెట్టుకుని దేవుడిలా పూజించాలని గౌరవించాలని ఆదేశించిన నియంత. ప్రజలు ఎటువంటి దృశ్యాలు (సినిమాలు, సిరిస్ లు వంటివి) చూడాలో కూడా దేశాధినేత నిర్ణయించే దేశం నార్త్ కొరియా. అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్రయోగాలతో శతృదేశాలను హడలెత్తించే కిమ్.. తాజాగా తన దేశ ప్రజలకు మరో హుకుం జారీ చేశారు. అదే తన ముద్దుల కూతురు పేరును ‘ జు-యే’ అనే పేరు ఎవ్వరికి ఉండకూడదని ఎవ్వరు పెట్టుకోకూడదని హుకుం జారీ చేశారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇప్పటికే ఆ పేరు ఉంటే వారి పేర్లు మార్చుకోవాలని..వారి బర్త్ సర్టిఫికెట్లలోను ఇతర దవీకరణ పత్రాల్లోను మార్చుకోవాలని ఆదేశించారు.

North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

అణుబాంబుల తయారీతోనో, మిస్సైళ్ల ప్రయోగాలతోనో వార్తల్లోకి ఎక్కే కిమ్.. కొంతకాలంగా తన కూతురితో కనిపిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా తన ముద్దుల కూతురు పేరు దేశంలో ఎవ్వరికి ఉండకూడదని హుకుం జారీ చేశారు కిమ్. కిమ్ కూతురు పేరు ‘కిమ్ జు-యే’(‘Ju-ae’). ఆ పేరు ఇక దేశంలో ఎవ్వరికి ఉండకూడదని ఒకవేళ ఉంటే వారంతా పేర్లు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కిమ్. ఎందుకంటే అతని ముద్దుల కూతురు అతని కూతురే ఉత్తర కొరియాకు కాబోయే అధినేత్రి అనే ప్రచారం కూడా మొదలైంది.పట్టుమని పదేళ్లు ఉన్న కిమ్ జు-యే నార్త్ కొరియాకు కాబోయే అధ్యక్షురాలనే ప్రచారం జరుగుతోంది.10 చిన్న వయసులోనే.. కూతురికి అధికార పగ్గాలు కట్టబెట్టాలని కిమ్ అనుకుంటున్నట్లుగా ఆదేశ మీడియా సైతం ఇన్ డైరెక్టుగా ప్రచారం చేస్తోంది.

నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుటుంబమంటే.. మొన్నటిదాకా ఓ రహస్యం. బయటి ప్రపంచానికి తన కుటుంబీకులను ఎప్పుడూ దూరంగా ఉంచే కిమ్.. ఇటీవలి కాలంలో.. తన కూతురితో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. లేటెస్ట్‌గా.. మరోసారి కిమ్ తన కూతురితో కలిసి ఆర్మీ పరేడ్‌కు హాజరయ్యారు. దాంతో.. ఆ అమ్మాయే.. కిమ్ వారసురాలనే టాక్ మొదలైంది. అంతేకాదు.. నార్త్ కొరియాలో జు-యే అనే పేరున్న వాళ్లంతా.. వారి పేర్లు మార్చుకోవాలని అక్కడి అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కిమ్ తన రెండో కూతురిని ప్రపంచం ముందుకు తీసుకొస్తుండటంతో.. ఆమె అధికార పగ్గాలు కట్టబెట్టబోతున్నారా? అనే చర్చ సాగుతోంది. కిమ్ జు-యే వయసు.. దాదాపు 10ఏళ్లు ఉంటుంది. 3 నెలల గ్యాప్‌లో.. కిమ్ తన కూతురితో కలిసి బహిరంగ ప్రదర్శనల్లో పాల్గొనడం ఇది ఐదో సారి. ఇంత తక్కువ టైమ్‌లోనే.. ఆ అమ్మాయిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. అంతర్గతంగా.. ఉత్తర కొరియా భవిష్యత్ నేతగా ఆ అమ్మాయిని ఎంపిక చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

కిమ్ జు-యే గతేడాది నవంబర్‌లో.. తొలిసారి బహిరంగంగా కనిపించింది. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ని లాంచ్ చేసే సమయంలో.. తండ్రితో కలిసి ఆ కార్యక్రమాన్ని చూసింది. అప్పుడే చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ అమ్మాయే.. ఏదో ఒక రోజు ప్రపంచంలోనే అత్యంత రహస్య రాజ్యానికి సారథి కానుందా? అనే గుసగుసలు వినిపించాయి. అయితే.. ఆ అంచనాలకు అప్పుడంత బలం లేదు. ఎందుకంటే.. ఆ అమ్మాయి అప్పుడు చాలా చిన్నపిల్లలా కానిపించింది. కిమ్.. తనను తాను ఓ మంచి తండ్రిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు.. ఆయుధాలతో పాటు తనకూ కుటుంబం ఉందని చాటటానికే.. కూతురుని వెంటబెట్టుకొచ్చారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ.. కిమ్ జు యే.. తండ్రితో కలిసి బహిరంగ కార్యక్రమాలకు వస్తున్న ప్రతిసారీ.. ఆమె స్థాయి అంతకంతకూ పెరుగుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

North Korea Kim : దక్షిణ కొరియా సినిమాలు చూసినందుకు..ఉత్తర కొరియాలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులకు మరణశిక్ష

ఉత్తర కొరియా పరిణామాలను నిశితంగా పరిశీలించే చాలా మంది.. కిమ్ తన కూతురిని బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు.. ప్రతి కార్యక్రమంలో.. ఆ అమ్మాయే కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొరియా పీపుల్స్ ఆర్మీ పరేడ్‌కు ముందు.. అత్యున్నత సైనికాధికారుల సమావేశానికి కూడా కిమ్ కుమార్తె.. జు యే హాజరైంది. ఆమె.. తండ్రికి, తల్లికి మధ్యన కూర్చొని ఉంటే.. చుట్టూ సైనికాధికారులున్నారు. ఈ ఫోటో బయటకొచ్చాకే.. ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయ్. మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. కిమ్ జు యే గురించి చెప్పేందుకు ఉత్తర కొరియా మీడియా వాడుతున్న భాష కూడా మారిపోయింది. గతంలో.. నార్త్ కొరియా ప్రభుత్వ మీడియా.. ఆమెను తొలిసారి పరిచయం చేసినప్పుడు.. కిమ్ జోంగ్ ఉన్ ప్రియమైన పుత్రిక అని అభివర్ణించింది. మిలటరీ విందు నాటికి.. ఆమెను ‘గౌరవనీయమైన పుత్రిక’ అని మీడియా సంబోధించింది. నార్త్ కొరియాలో.. ‘అత్యంతగా గౌరవించే వారికి’ మాత్రమే.. గౌరవనీయమైన అనే పదాన్ని వాడతారు.

ఎప్పుడూ.. దేశ పాలన, సైనిక వ్యవహారాల్లో సింగిల్‌గా కనిపించే కిమ్.. తన కూతురిని పదే పదే బయటకు తీసుకురావడం ద్వారా.. దేశ పగ్గాలు తన తర్వాత తన వారుసులకే దక్కే అవకాశాలున్నాయన్న సంకేతాలను ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. కిమ్ జు యే కూడా.. మునుపటి కంటే తెలివిగా కనిపిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే.. రెండో కుమార్తె.. కిమ్ జు యే అంటేనే.. కిమ్‌కు ఎక్కువ ప్రేమ అంటున్నారు. అందువల్లే.. ఆమెను ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే.. కిమ్ జూ యేను ఇంత చిన్న వయసులో.. వారసురాలిని చేయాలని.. కిమ్ ఎందుకు తొందరపడుతున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్.

Kim Jong-un : కిమ్ మరో వింత నిర్ణయం : పిల్లలకు బాంబు, తుపాకీ, ఉపగ్రహం అని పేరు పెట్టాలని ఆదేశం

ఉత్తర కొరియా ఆవిర్భవించినప్పటి నుంచి.. ఆ దేశాన్ని కిమ్ కుటుంబం మూడు తరాలుగా పాలిస్తోంది. అక్కడ ఈ కుటుంబ ఆధిపత్యమే కొనసాగుతోంది. పైగా.. వాళ్ల కుటుంబానికి.. పవిత్రమైన వారసత్వం ఉందని దేశ ప్రజలకు చెబుతుంటారు. దాని అర్థం.. దేశానికి ఆ కుటుంబం మాత్రమే నాయకత్వం వహించగలదని చెప్పడం. ఇప్పుడు.. కిమ్ జోంగ్ ఉన్ కూడా.. ఉత్తర కొరియా సింహాసనాన్ని.. తమ కుటుంబంలోని నాలుగో తరానికి అప్పగించాలనుకుంటున్నారని.. అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఆ కోవలోనే.. కిమ్ కూతురు.. జు యేనే ఆయన వారసురాలనే ప్రచారం కూడా మొదలైపోయింది. అయితే.. ఇంత చిన్న వయసులోనే.. ఇంత త్వరగా.. ఆ అమ్మాయిని ఎందుకు.. ముందుకు తెస్తున్నారనేదే.. ఇప్పుడు బిగ్ క్వశ్చన్.