Kim Jong Un: కిమ్ సరికొత్త రూల్.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే ..

నిత్యం అణు క్షిపణుల ప్రయోగాలతో ప్రపంచ దేశాలన్నీ ఉత్తర కొరియావైపు చూసేలా చేసే కిమ్‌జోంగ్ ఉన్.. తాజాగా హాలీవుడ్ సినిమాలపై గురిపెట్టాడు. హాలీవుడ్ సినిమాలతో ప్రభావితమై ఎవరైనా తిరుగుబాటు లేవదీస్తారన్న అనుమానంతో ఏకంగా ఆ చిత్రాలపైనే కిమ్ నిషేధం విధించారు.

Kim Jong Un: కిమ్ సరికొత్త రూల్.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే ..

Kim Jong Un

Kim Jong Un: ఉత్తర కొరియా.. ఈ దేశం పేరు వింటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలన. ఆ దేశంలో ప్రజల అనేక ఆంక్షల మధ్య జీవనం సాగిస్తుంటారు. కిమ్ ఏది చెబితే అది శాసనం. గీత దాటినవారిపై కఠిన చర్యలకు కిమ్ జోంగ్ ఉన్ వెనుకాడడు. నిత్యం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, అణు క్షిపణుల పరీక్షలతో ప్రపంచ దేశాలు ఉత్తర కొరియావైపు చూసేలా కిమ్ జోంగ్ ఉన్ ప్రవర్తిస్తుంటాడు. తాజాగా ఆ దేశంలో విదేశీ చిత్రాలను నిషేధిస్తూ కిమ్ నిర్ణయించారు. విదేశీ చిత్రాలను (హాలీవుడ్ సినిమాలు) వీక్షిస్తూ పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను ఆరు నెలల పాటు కార్మిక శిభిరాలకు పంపుతామని, పిల్లలకు ఐదేళ్లు జైలు శిక్ష విధింబడుతుందని చట్టం తీసుకొచ్చారు.

North korea Kim Jong un : కరోనా కేసులు కాదని చెబుతునే..ఉత్తర కొరియా రాజధానిలో లాక్‌డౌన్ విధించిన ‘కిమ్’ ప్రభుత్వం

నిత్యం అణు క్షిపణుల ప్రయోగాలతో ప్రపంచ దేశాలన్నీ ఉత్తర కొరియావైపు చూసేలా చేసే కిమ్‌జోంగ్ ఉన్.. తాజాగా హాలీవుడ్ సినిమాలపై గురిపెట్టాడు. హాలీవుడ్ సినిమాలతో ప్రభావితమై ఎవరైనా తిరుగుబాటు లేవదీస్తారన్న అనుమానంతో ఏకంగా ఆ చిత్రాలపైనే కిమ్ నిషేధం విధించారు. హాలీవుడ్, విదేశీ సినిమాలను చూస్తూ దొరికితే ఆ పిల్లల తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని ప్రకటించారు. అయితే, మొదటి తప్పుగా తల్లిదండ్రులను ఆరు నెలలపాటు కార్మిక శిబిరాలకు తరలిస్తారు. అలాఅని ఆ సినిమాలను చూసిన పిల్లలను కూడా వదిలేది లేదంటూ కిమ్ కఠిన ఆంక్షలు జారీ చేశారు. హాలీవుడ్ సినిమాలు చూసిన పిల్లలకు ఐదేళ్లు శిక్ష విధించి శిబిరాలకు పంపుతారు.

Kim Jong Un : అమెరికాకు కిమ్ వార్నింగ్..అణు యుద్ధానికి మేము సిద్ధమే

గతంలో ఉత్తర కొరియాకు పొరుగుదేశం అయిన దక్షిణ కొరియాలోని సినిమాల క్యాసెట్లతో దొరికిన ఇద్దరు బాలలకు ఏకంగా మరణశిక్ష విధించినట్లు వార్తలు వచ్చాయి. ఇక, ఆ దేశంలో అశ్లీల చిత్రాలను చూస్తే అంతేసరి. అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్నట్లు సమాచారం అందితే కాల్చి చంపాలని గత నెలలో కిమ్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కిమ్ ఆ దేశంలోని పిల్లల తల్లిదండ్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పిల్లలకు తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్ఠత గురించి తెలియజేయాలని సూచించారు. మొత్తానికి కిమ్‌జోంగ్ ఉన్ నిరంకుశ పాలనతో, విచిత్ర చట్టాలతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.