Kim Jong Un : అమెరికాకు కిమ్ వార్నింగ్..అణు యుద్ధానికి మేము సిద్ధమే

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధమేనని కిమ్ ప్రక‌టించారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో పాల్గొన్న ఆయన...అమెరికాకు ప‌రోక్షంగా హెచ్చరిక‌లు జారీ చేశారు. అమెరికాతో సైనిక చ‌ర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ వెల్లడించారు.

Kim Jong Un : అమెరికాకు కిమ్ వార్నింగ్..అణు యుద్ధానికి మేము సిద్ధమే

Kim Jong

Kim Jong Un : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధానికి తాము సిద్ధమేనని కిమ్ ప్రక‌టించారు. కొరియా యుద్ధ వార్సికోత్సవంలో పాల్గొన్న ఆయన…అమెరికాకు ప‌రోక్షంగా హెచ్చరిక‌లు జారీ చేశారు. అమెరికాతో సైనిక చ‌ర్యకు పూర్తి స్థాయిలో తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ వెల్లడించారు.

అవ‌స‌రం అయితే అణ్వాయుధాల‌ను రంగంలోకి దింపుతామ‌న్నారు. ఉత్తర కొరియా 7వ సారి అణ్వాయుధాన్ని ప‌రీక్షించ‌నున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో కిమ్ ఇచ్చిన వార్నింగ్ కొత్త ప్రశ్నలకు తెర‌లేపింది. 2017లో చివ‌రిసారి ఉత్తర కొరియా న్యూక్లియ‌ర్ టెస్ట్ నిర్వహించింది. అయితే ఇటీవ‌ల కొరియా ద్వీప‌క‌ల్పంలో ఉద్రిక్తత‌లు నెలకొన్నాయి.

Kim Yo Jong : దక్షిణ కొరియాపై అణు దాడి చేస్తాం.. కిమ్ సోద‌రి హెచ్చరిక..!

ఈ ఏడాది ఉత్తర కొరియా ఇప్పటికే అత్యధిక స్థాయిలో మిస్సైళ్లను ప‌రీక్షించింది. ఇప్పటి వ‌ర‌కు 31 మిస్సైళ్లను ప‌రీక్షించిన‌ట్లు అమెరికా ప్రతినిధి తెలిపారు. అయితే ఉత్తర కొరియాపై అమెరికా వ్యవ‌హ‌రిస్తున్న దూకుడు విధానాన్ని కిమ్ త‌ప్పు ప‌ట్టారు. అగ్రరాజ్యం తీరు మార‌డంలేద‌న్నారు.