Kim Yo Jong : దక్షిణ కొరియాపై అణు దాడి చేస్తాం.. కిమ్ సోదరి హెచ్చరిక..!
Kim Yo Jong : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ అణుబాంబుతో దాడి చేస్తామంటూ దక్షిణ కొరియాను గట్టిగానే హెచ్చరించింది.

Kim Yo Jong North Korea's Nukes Could Eliminate South, Says Kim Jong Un's Sister
Kim Yo Jong : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ నియంత అయితే.. ఆయనకంటే పవర్ ఫుల్‌గా ఉంది సోదరి కిమ్ యో జాంగ్.. అణుబాంబుతో దాడి చేస్తామంటూ దక్షిణ కొరియాను గట్టిగానే హెచ్చరించింది కిమ్ సోదరి. ఒకవేళ దక్షిణ కొరియా ముందుస్తుగా ఉత్తర కొరియాపై ఆర్మీ దాడికి ప్రయత్నిస్తే మాత్రం.. ఆలస్యం చేయకుండా వెంటనే అణుబాంబుతో దక్షిణ కొరియాపై దాడి చేయడానికి వెనుకాడేది లేదని కిమ్ సోదరి స్పష్టం చేశారు. సౌత్ కొరియా ఆర్మీని అణ్వాయుధాలతో తుడిచిపెట్టేస్తామని కిమ్ యో జాంగ్ హెచ్చరించింది. దక్షిణ కొరియా రక్షణ శాఖ చీఫ్ సు వూక్ ఉత్తర కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉంటే.. ఉత్తర కొరియాలోని ఏ లక్ష్యాన్ని అయినా ఖచ్చితంగా వేగంగా ఛేదించగల సామర్థ్యాన్ని దక్షిణ కొరియా సైన్యం క్షిపణులను కలిగి ఉందని వూక్ చెప్పారు. అతడి వ్యాఖ్యలకు కౌంటర్ గా కిమ్ సోదరి వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా అదే సాహసం చేస్తే.. అదో పెద్ద తప్పు అవుందని, రక్షణ చీఫ్ ఉన్మాదిలా దాడులు చేస్తామంటున్నారని కిమ్ సోదరి ఆరోపించారు. 2022 ఏడాదిలో ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షలతో బెంబేలిత్తిస్తోంది.

Kim Yo Jong North Korea’s Nukes Could Eliminate South, Says Kim Jong Un’s Sister
గత నెలలో 2017 నుంచి పూర్తి స్థాయిలో మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఒవేళ దక్షిణ కొరియా సైనిక చర్యకు పాల్పడితే.. అప్పుడు తమ న్యూక్లియర్ దళం వాళ్లను మట్టికరిపిస్తుందని కిమ్ సోదరి స్పష్టం చేశారు. ఉత్తరకొరియా సైనిక దళాలతో సమర్థవంతంగా పోరాడగల సామర్థ్యం దక్షిణ కొరియాకు లేదని సోదరి యో జాంగ్ స్పష్టం చేశారు.
తమ అణు దళాలకు ప్రాథమిక లక్ష్యంగా ఒక నిరోధకంగా పనిచేయడమేనని ఆమె అన్నారు. సాయుధ పోరాటం మొదలైతే అలాంటి ఆయుధాలు సాయుధ బలగాలను మట్టుబెట్టడానికి ఉపయోగపడతాయని ఆమె అన్నారు. ఉత్తర కొరియా అణుబాంబులతో దాడి చేస్తే.. దక్షిణ కొరియా పూర్తిగా విధ్వంసం అవుతుందని హెచ్చరించారు. ఉత్తర కొరియా దాడులకు దిగకుండా ఉండాలంటే దక్షిణ కొరియా క్రమశిక్షణతో ఉండాలని ఆమె సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నత స్థాయి దౌత్యంలో ఉత్తర కొరియా సుదూర అణు పరీక్షలను నిలిపివేసింది. అప్పటి నుండి ఇరుదేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయి. ఉత్తర కొరియా ఈ నెలలో వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ (కిమ్ తాత) పుట్టిన 110వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.
Read Also : Kim Jong Un: అమెరికా, జపాన్‌లను రెచ్చగొడుతున్న నార్త్ కొరియా నియంత కిమ్.. Hwasong-17 క్షిపణి ప్రయోగం..