Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!

ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది..ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో దేశంలో వ్యవసాయ విధానంలో చేయాల్సిన కీలక మార్పులపై ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ.. కిమ్ జోంగ్ ఉన్ మిలటరీ గొప్పలు, ప్రచారం, ఆర్భాటాలే.. ప్రజలను ఆకలి చావులపై నడిపిస్తున్నాయనే.. చర్చ జరుగుతోంది.

Kim Jong Un: ఉత్తరకొరియాలో ఆకలి చావులు .. మిలటరీ గొప్పల్లో మునిగితేలుతున్న కిమ్..!

Kim sounds alarm on agriculture amid reports of food shortages

Kim Jong Un: ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది.. ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో దేశంలో వ్యవసాయ విధానంలో చేయాల్సిన కీలక మార్పులపై ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ.. కిమ్ జోంగ్ ఉన్ మిలటరీ గొప్పలు, ప్రచారం, ఆర్భాటాలే.. ప్రజలను ఆకలి చావులపై నడిపిస్తున్నాయనే.. చర్చ జరుగుతోంది.

అవును.. ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కిమ్ వరుసగా తన మిలిటరీ బల ప్రదర్శనను కొనసాగిస్తున్న సమయంలో.. మిస్సైల్ టెస్టులు చేస్తున్న టైమ్‌లో.. అక్కడి వ్యవసాయం, ఆహార సంక్షోభం.. చర్చనీయాంశంగా మారాయ్. ఆయుధ సంపత్తిని పెంచుకోవడం, తన తర్వాతి వారసురాలిగా కూతురిని.. దేశానికి పరిచయం చేయడం.. నార్త్ కొరియా మిలటరీ శక్తిని.. ప్రపంచానికి చాటడం మీదే.. దృష్టి పెట్టిన కిమ్.. ప్రజా సంక్షేమాన్ని చాలా వరకు పట్టించుకోలేదు. పైగా.. కరోనా సమయంలో కఠినమైన లాక్ డౌన్ విధించడంతో.. వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతింది. అది కాస్తా.. ఆహార కొరతకు దారితీసింది. ఆకలి విషయంలో జనం ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. సంక్షోభం మొదలయ్యాక గానీ.. కిమ్‌కు అసలు విషయం అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Kim Jong Un: కిమ్ సరికొత్త రూల్.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే ..

నార్త్ కొరియాలో ఆహార కొరత తీవ్రమవుతుందనే భయాల మధ్య.. దేశ వ్యవసాయ విధానంలో కీలక మార్పుల కోసం కృషి చేయాలని.. ప్రభుత్వ అధికారులను ఆదేశించారు కిమ్. ఈ ఏడాది.. ధాన్యం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే ఇప్పుడు ప్రభుత్వప్రాముఖ్యత అని.. కిమ్ జోంగ్ ఉన్ నొక్కి చెప్పారు. మిత్రదేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా.. దేశీయంగా పంట ఉత్పత్తులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. ఉత్తర కొరియా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన మార్పులను వెంటనే ప్రవేశపెట్టాలని.. అధికారులకు సూచించారు. వేగంగా.. ప్రజలకు ఆహారం అందించే విధంగా వ్యవసాయరంగంలో మార్పులు చేయాలన్నారు.

Read more : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

వాస్తవానికి.. 2021 కంటే 2022లో ఉత్తర కొరియా లక్షా 80 వేల టన్నుల ఆహారాన్ని తక్కువగా ఉత్పత్తి చేసినట్లు.. శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. కరవు, వరదలు లాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా.. చలికాలం, ఎండాకాలంలో పంటల దిగుబడి తక్కువగా ఉంటుందని.. జూన్‌లోనే డబ్ల్యూఎఫ్‌పీ ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో.. గతేడాది చివర్లోనే.. నార్త్ కొరియా రికార్డు స్థాయిలో రెండో అత్యంత దారుణమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటుందని అక్కడి అధికారిక మీడియాలోనే కథనాలు వచ్చాయ్. అంచనాలకు తగ్గట్లుగానే.. ఈ ఏాడది ఆహారం ధరలు అమాంతం పెరిగిపోయాయ్. ఈ పరిస్థితులతో.. జనం చవకైన పదార్థాల వైపు చూస్తున్నారు. ఈ ఏడాది మొదట్లోనే.. కొరియాలో మొక్క జొన్న ధరలు 20 శాతం పెరిగాయ్. అక్కడి ప్రజలు ఎక్కువగా మొక్కజొన్న కొంటున్నారంటే.. బియ్యం లాంటి ప్రధాన ఆహార దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అర్థం.

Kim Jong Daughter ‘Ju-ae’ : కిమ్ జోంగ్ కూతురు ‘జు-యే’ అనే పేరు ఎవ్వరు పెట్టుకోకూడదు..ఉంటే పేరు మార్చుకోవాలని నార్త్ కొరియా ప్రభుత్వం ఆదేశం

ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. 2015లో నార్త్ కొరియా జీడీపీ సుమారు 1700 డాలర్లుగా అంచనా వేశారు. ఈ మధ్య ఇది మరింత తక్కువైంది. పారదర్శకత లేని కొరియా ఆర్థిక వ్యవస్థను బట్టి చూస్తే.. దేశంలో వాస్తవ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయ్. కఠినమైన కోవిడ్ సరిహద్దు ఆంక్షల కారణంగా.. బయటి నుంచి సాయం పంపడం కూడా కష్టంగా మారింది. కరోనా విజృంభణకు ముందు నుంచే సరిహద్దు వాణిజ్యం, ట్రాఫిక్‌పై.. ఉత్తర కొరియా కఠిన ఆంక్షలు విధించింది. వైరస్ ఉద్ధతి మొదలయ్యాక.. ప్రాథమిక అవసరాలైన వస్తువుల సప్లై తగ్గినట్లు తెలుస్తోంది. పైగా.. ఉత్తర కొరియాకు అంతర్జాతీయ సమాజం నుంచి లభించే మానవతా సాయం కూడా బాగా తగ్గింది. ఇందుకు.. రెచ్చగొట్టేలా ఉన్న కొరియా సైనిక చర్యలే కారణంగా చెబుతున్నారు. వాటి వల్లే.. అంతర్జాతీయ ఆంక్షలు కఠినతరమయ్యాయ్. అయితే.. 1990లలోనూ.. నార్త్ కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. అప్పుడు.. లక్షలాది మంది ప్రజలు మరణించారు. తాజాగా సంభవించిన ఆహార సంక్షోభం అంత పెద్దది కాదని.. తీవ్రత పెరగకముందే సత్వర చర్యలు తీసుకోవాలని.. కిమ్ ప్రభుత్వం భావిస్తోంది.

North Korea : The Uncle సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం