US అధ్యక్ష ఎన్నికలకు ముందే.. ప్రపంచ అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి ఆవిష్కరించిన ఉత్తర కొరియా.. కిమ్ వ్యూహం ఏంటో?

  • Publish Date - October 11, 2020 / 09:34 PM IST

Kim Ballistic Missile : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోనే అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించారు. వర్కర్స్ పార్టీ 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మిలటరీ పరేడ్‌లో ఈ క్లిపణిని కిమ్ ప్రదర్శించారు. అమెరికాలో నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో జోసెప్ బైడెన్ పోటీపడుతున్నారు. సరిగ్గా అమెరికా ఎన్నికల సమయంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించడం వెనుక కిమ్ వ్యూహాం ఏంటి అనేది చర్చనీయాంశమైంది.

ఈ పరేడ్ సందర్భంగా కిమ్ ఆర్మీని ప్రసంసిస్తూ ప్రసంగించిన వీడియో ఒకటి స్టేట్ టెలివిజన్ లో ప్రసారమైంది. అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ప్రదర్శించిన సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధించడానికి దేశం చేస్తున్న కృషిని కూడా ఆయన కొనియాడారు.


అపారమైన బాలిస్టిక్ క్షిపణిని 11-axle truck ద్వారా తీసుకెళ్లినట్లు నిపుణులు తెలిపారు. ఉత్తర కొరియా mammoth క్షిపణిని పరీక్షించిందా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఈ క్షిపణి పెద్దది, ఎక్కువ పేలోడ్ మోయగల సామర్థ్యం దీని సొంతం. దక్షిణ కొరియా, జపాన్, ప్రాంతీయ యుఎస్ స్థావరాలకు తీవ్ర ముప్పును సూచిస్తోంది.
ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద రోడ్ మొబైల్ లిక్విడ్ ఇంధన క్షిపణి అంటూ Carnegie Endowment for International Peace వద్ద న్యూక్లియర్ పాలసీ ప్రొగ్రామ్ కు చెందిన సీనియర్ అధికారి Ankit Panda ట్వీట్ చేశారు. MIRV న్యూక్లియర్ వార్ హెడ్స్ మోయగల భారీ సామర్థ్యం గలది లిక్విడ్ ఫ్యూయల్ క్షిపణి అంటూ Open Nuclear Network at Stanford University డిప్యూటీ డైరెక్టర్ Melissa Hanham ట్వీట్ చేశారు.


వాస్తవానికి ఉత్తరకొరియాలో ఈ శనివారం ఉదయమే మిలటరీ పరేడ్ నిర్వహించారని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమర్షియల్ శాటిలైట్ ఇమాజినరీ ప్రకారం.. కొన్నివారాలుగా ఉత్తర కొరియా సైన్యం దీనికి సంబంధించి సాధన చేసింది. పరేడ్ కార్యక్రమంలో భాగంగా ఉత్తర కొరియా ఓ కొత్త intercontinental ballistic missile (ICBM) లేదా కొత్త సబ్ మెరైన్ బాలిస్టిక్ క్షిపణి (SLBM) లాంచ్ చేస్తోందని పేర్కొంది.