Storm Eunice : యూనిస్‌ తుఫాను బీభత్సం.. 9 మంది మృతి.. రాకాసి గాలుల భయానక దృశ్యాలు..

సెంట్రల్ అట్లాంటిక్‌లో యూనిస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. వాయువ్య ఐరోపా (Northwestern Europe)లో యూనిస్ తుఫాను ప్రభావంతో గంటకు 122 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

Storm Eunice High Winds, Flying Debris Affect Millions; 9 Dead (6)

Storm Eunice : సెంట్రల్ అట్లాంటిక్‌లో యూనిస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. వాయువ్య ఐరోపా (Northwestern Europe)లో యూనిస్ తుఫాను ప్రభావంతో గంటకు 122 మైళ్ల వేగం (196కిలోమీటర్లు)తో గాలులు వీస్తున్నాయి. ఇప్పటివరకూ రాకాసి గాలుల ధాటికి ఇప్పటివరకూ 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఐరోపాలో మిలియన్ల మందిపై తుఫాను ప్రభావం పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంగ్లండ్‌‌లో బలమైన గాలులు వీస్తున్నాయి. దక్షణ దేశంలో అన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో అల్లకల్లోలమైపోయాయి.

నార్తరన్ యూరోపియన్ దేశాల్లో బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్స్ లో తుఫాను తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకూ బ్రిటన్ దేశంలో తుఫాను ధాటికి ముగ్గురు మృతిచెందాగా.. దక్షిణ ఇంగ్లండ్‌లో మరొకరు దుర్మరణం పాలయ్యారు. తుఫాను కారణంగా పదివేల మంది నివాసితులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను జెట్ స్ట్రీమ్ ద్వారా అజోర్స్ నుంచి యూరప్ వైపు దూసుకెళ్తోంది. ఈ తుఫాను ఆ ప్రాంతవాసుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ కార్యాలయం వెల్లడించింది.

తుఫాను పశ్చిమ ఇంగ్లాండ్‌ను తాకింది. ఆపై కార్న్‌వాల్‌లో తీరాన్ని తాకింది. అక్కడ అలలు తీరాన్ని తాకాయి. లండన్‌లో రాకాసి గాలల బీభత్సానికి ఒక మహిళ ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. లివర్‌పూల్‌లో గాలుల ప్రభావానికి శిథిలాలు గాల్లో ఎగిరిపోతున్నాయి.

శిథిలాలు బలంగా తాకడంతో వాహనంలో ఉన్న వ్యక్తి మరణించాడు. హాంప్‌షైర్‌లోని దక్షిణ ఇంగ్లీష్ కౌంటీలో పడిపోయిన చెట్టును వాహనం ఢీకొని మరో వ్యక్తి మరణించాడు. నెదర్లాండ్స్‌లో చెట్లు విరిగిపడి ముగ్గురు మృతి చెందారు.

బెల్జియంలో బలమైన గాలులు ఒక ఆస్పత్రి పైకప్పుపైకి ఒక క్రేన్‌ను తీసుకువచ్చాయి. బ్రిటన్‌కు చెందిన 79ఏళ్ల వ్యక్తి తన పడవలో నుంచి నీటిలోకి ఎగిరి ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఐర్లాండ్‌లో తుఫాను శిధిలాలను తొలగిస్తున్న క్రమంలో చెట్టు పడిపోవడంతో వ్యక్తి మరణించాడు. లండన్‌లోని రాకాసి గాలులు కారణంగా O2 అరేనా తెల్లటి గోపురం పైకప్పు ఛిన్నాభిన్నమైంది. ఐల్ ఆఫ్ వైట్‌లోని ది నీడిల్స్ వద్ద 122mph వేగంతో గాలులు వీచినట్లు మెట్ ఆఫీస్ పేర్కొంది.

తాత్కాలికంగా ఇంగ్లాండ్‌లో నమోదైన అత్యంత శక్తివంతమైన గాస్ట్‌ (gusts)గా రికార్డ్ అయింది. వాతావరణ కార్యాలయం తుఫాను నుంచి భీకరమైన గాలులు స్కాండినేవియా, ఉత్తర ప్రధాన భూభాగం ఐరోపా వైపు దూసుకెళ్తున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

జయునిస్ తుఫాను నుంచి రికార్డు గాలుల మధ్య యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా మొత్తం 436 విమానాలు రద్దు అయ్యాయి. ఈ వారంలో యూరప్‌లో బీభత్సం సృష్టించిన తుఫాన్లలో యూనిస్ తుఫాను రెండోది.. మొదటి తుఫాను ప్రభావంతో జర్మనీ, పోలాండ్‌లో కనీసం ఐదుగురు వరకు ప్రాణాలు కోల్పోయారు.

Read Also : America: అమెరికాలో మంచు తుఫాను.. విమాన సర్వీసులు రద్దు

ట్రెండింగ్ వార్తలు