America: అమెరికాలో మంచు తుఫాను.. విమాన సర్వీసులు రద్దు

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియా నగరాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.

America: అమెరికాలో మంచు తుఫాను.. విమాన సర్వీసులు రద్దు

America

America: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియా నగరాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.

రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోగా.. మంచు తుఫాను ధాటికి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. నాలుగు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు.

హిమపాతం పెరిగే అవకాశం ఉందన్న అమెరికా వాతావరణ విభాగం అంచనాల మేరకు ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ప్రజలెవరు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు.

అమెరికాలోని ఉత్తర ప్రాంతాల్లో మంచు బీభత్సం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లేవు.