Not one 4 Virus Variants in China
4 Virus Variants in China : ఇక కోవిడ్ పీడ విరగడ అయ్యింది ఇక హాయిగా ఊపిరి తీసుకోవచ్చనుకుంటున్న వేళ మరోసారి దాని ప్రతాపాన్ని చూపుతోంది మహమ్మారి. కొత్త కొత్త వేరియంట్లుగా మారి హడలెత్తిస్తోంది. ప్రపంచమంతా కోవిడ్ కోరల్లోంచి కోలుకుని ఎప్పుడు మాస్కులు తీసిపారేసి హాయిగా ఊపిరి తీసుకుంటున్నవేళ మరోసారి చైనాలోనే కల్లోలం రేపింది కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7. లక్షల్లో కేసులు నమోదు అవుతూ డ్రాగన్ దేశానికి చుక్కలు చూపిస్తోంది. ఈ బీఎఫ్.7 వేరియంట్ కేసులు పలు దేశాలకు కూడా విస్తరించాయి. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.
చైనాలో జీరోకోవిడ్ విధానం ఎత్తివేశాక కోవిడ్ వ్యాప్తి అత్యంత వేగంగా విస్తరించింది. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. మరణాలు కూడా వేలల్లోనే జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలు బయటకు రానీయటంలేదు. స్థానిక మీడియాను కూడా కోవిడ్ వార్తలను ప్రసారం చేయనీయటంలేదు.
ఇదిలా ఉంటే చైనాలో కోవిడ్ కేసులు అంత వేగంగా వ్యాప్తి చెందటానికి కోవిడ్ బీఎఫ్.7 వేరియంట్ ఒక్కటే కాదని నాలుగు వేరియంట్లు కారణమని భారత ప్రభుత్వం వెల్లడించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చైనాలో కోవిడ్ ఉదృతికి ఒకటి కాదు నాలుగు వేరియంట్లు కారణమని భారత ప్రభుత్వ కొవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్‌కే అరోడా ఓ వీడియాకు వెల్లడించారు. కానీ చైనాలో ఉన్న ఈ పరిస్థితి చూసి భారత్ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనాలో కొవిడ్ వేవ్‌కు పలు రకాల వేరియంట్లే కారణమని..బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15శాతమే అని తెలిపారు.BN,BQ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తుండగా.. SVV వేరియంట్ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని
కానీ ఈ వేరియంట్ల గురించి భారత్ ఏమత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత ప్రజల్లోని హైబ్రీడ్ ఇమ్యూనిటీ కారణంగా భయపడాల్సిన పనిలేదని..ఇది వ్యాక్సిన్ల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కొవిడ్ తొలి, ద్వితీయ, తృతీయ వేవ్‌ల కారణంగా లభించిందని తెలిపారు. న్నారు. చైనాతో పోలిస్తే భారత్‌లో 97 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకొన్నారని..ఇది భారతీయులకు ప్లస్ అయ్యిందని అరోడా వివరించారు.