NRIs : అమెరికాలో బియ్యం కొనుగోళ్లకు ఎగబడుతున్న ఎన్నారైలు.. స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు

అమెరికాలో ఎన్నారైలు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీసి బియ్యం ప్యాకెట్స్ కొనేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోంది.

India rice export ban

NRIs USA : అమెరికాలోని బియ్యం కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్లకు ఎగబడుతున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు వెళ్లి బియ్యాలను కొనేందుకు పోటీ పడుతున్నారు. భారత్ నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం (India rice export ban) విధించడంతో ఇక అమెరికాలో బియ్యం కొరత ఏర్పడతుందనే భయంతో ఎన్నారైలు అంతా సూపర్ మార్కెట్లకు వెళ్లి అందరినకాడికి బియ్యం ప్యాకెట్స్ కొనేస్తున్నారు. దీంతో మార్కెట్స్ లో బియ్యం స్టాక్ క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయి. భారీ సంఖ్యలో ఎన్నారైలు బియ్యం కోసం స్టోర్లకు ఎగబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ మార్కెట్ల వద్ద భారతీయులు సోనా మసూరీ బియ్యం కోసం క్యూకట్టటంతో అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీసి బియ్యం ప్యాకెట్స్ కొనేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో పలు రకాల నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బియ్యం కొరత వార్తలు రావటంతో అన్ని సూపర్ మార్కెట్లలోను బియ్యం ప్యాకెట్స్ క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. ప్రవాస తెలుగువారే ఎక్కువగా బియ్యం కొనుగోలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Tierra Young Allen : పబ్లిక్ ప్లేస్‌లో గట్టిగా అరిచిందని అరెస్ట్ .. రెండు నెలలుగా జైల్లోనే టిక్ టాక్ స్టార్

బాస్మతీయేతర బియ్యంపై భారత్ నిషేధం విధించిన వార్త లైవ్ టెలికాస్ట్ కాగానే భారతీయుల్లో గుబులు మొదలైందని తెలుస్తోంది. ఈ వార్త వచ్చినప్పటినుంచి భారతీయులు భారీ ఎత్తున బియ్యం కొనుగోళ్లకు తరలివచ్చారని అక్కడి మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో బ్రాండ్ చూసి కొనేవారు.. ఇప్పుడలా కాదు బ్రాండ్ పేరు ఏదైనా బియ్యం ప్యాకెట్ కనిపిస్తే చాలు కొనేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితిని అమెరికా సూపర్ మార్కెట్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ధర పెంచేసి మరీ అమ్మేస్తున్నాయి. దీంతో ధర ఎక్కువైనా బియ్యం దొరికితే చాలు అన్నట్లుగా అధిక ధరలు ఇచ్చి కొనేస్తున్నారు. డిమాండ్ ఉండటంతో సిట్యువేషన్ ను క్యాష్ చేసుకోవటం తప్పటంలేదని అక్కడి భారతీయ సూపర్ మార్కెట్ యజమాని ఒకరు వెల్లడించారు.

కాగా, బాస్మతీయేత బియ్యంపై మాత్రమే భారత్ నిషేధం విధించింది. బాయిల్డ్ రైస్ తో పాటు మిగిలిన బియ్యంపైనా.. ఆటా,గోధుమలు వంటి ఆహార పదార్దాలు అందుబాటులో ఉన్నాయి. బియ్యం కొరత ఏర్పడుతుందనే ఆందోళన పడవద్దని చెప్పినా ఎన్నారైలు మాత్రం బియ్యాన్ని భారీగా కొనేయటానికే ఎగబడుతున్నారు.

First For US Military : జో బిడెన్ సంచలన నిర్ణయం…మొట్టమొదటిసారి యూఎస్ నేవీకి మహిళా అధికారిణి నేతృత్వం

ట్రెండింగ్ వార్తలు