Jensen Huang Affair : జెన్సన్ హువాంగ్ మామూలోడు కాదు.. కంపెనీ ఉద్యోగినితోనూ వివాహేతర సంబంధం..! భారీగా పతనం అవుతున్న షేర్లు
Jensen Huang Affair : ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
- Harish Thanniru
- Published on- November 12, 2026 / 08:13 AM IST
Jensen Huang Affair
Jensen Huang Affair : ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే చైనా మహిళతో సంబంధం, గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన ఆయనపై తాజాగా మరో కథనం వెలువడింది. తన కంపెనీలోనే పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిణితో ఆయన వివాహేతర సంబంధం కొనసాగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
తాజా వివరాల ప్రకారం.. ఎన్విడియాలో హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఐదుగురు మాజీ కంపెనీ ఉద్యోగులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే చైనా గూఢచారి అలిస్ హువాంగ్‌తో సంబంధాన్ని అంగీకరించిన జెన్సన్‌కు ఇదో షాక్. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించేందుకు యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. కంపెనీ బోర్డు నేడు సమావేశం కానుందన్న వార్తలతో వాల్‌స్ట్రీట్‌లో పోస్ట్ ట్రేడింగ్ అవర్స్‌లో ఎన్విడియా షేర్లు భారీగా పతనం కావడం మొదలుపెట్టాయి. దీంతో ఇప్పటి వరకు మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఎన్విడియాలో హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న 48ఏళ్ల కింబర్లీ పావెల్‌తో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఐదుగురు మాజీ కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ఆమె నేరుగా సీఈఓ హువాంగ్‌కు రిపోర్ట్ చేస్తారని సమాచారం. ఈ ఏడాది మార్చిలో శాన్‌జోస్‌లో జరిగిన కంపెనీ సమావేశం సందర్భంగా ఓ హోటల్‌లో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు కూడా కథనం పేర్కొంది. ఆమెకు ఇప్పటికే వేరే వ్యక్తితో వివాహం కూడా జరిగింది. కింబర్లీ 2008లో ఎన్విడియాలో చేరారు. తొలుత ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, మెడికల్ ఇమేజింగ్ పరికరాలకు చిప్ టెక్నాలజీ వినియోగం వంటి అంశాలను పర్యవేక్షించేవారు. 2017 నాటికి కంపెనీలోని హెల్త్‌కేర్ విభాగానికి వైస్‌ప్రెసిడెంట్‌గా ఆమె ఎదిగారు.
జెన్సన్ అక్రమ సంబంధాల వార్తల నేపథ్యంలో ఎన్విడియా మార్కెట్ విలువ భారీగా పడిపోతోంది. బుధవారం ట్రేడింగ్ లోఎన్విడియా షేరు కోలుకొని 2శాతంకుపైగా లాభపడింది. కానీ, క్లింబరీతో జెన్సన్ వివాహేతర సంబంధంకు సంబంధించిన విషయం బయటకు రావడం, బోర్డు నేడు సమావేశం కానుందన్న అంశంపై వార్తలు రావడంతో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్‌లో షేరు ఏకంగా 8శాతం నష్టపోయి 159 డాలర్ల వద్దకు చేరింది. ఫలితంగా ఎన్విడియా మార్కెట్ విలువ 280 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ.26 లక్షల కోట్లు) మేర ఆవిరైపోయింది.
