Oil Prices Hike : వారం రోజుల్లో చమురు ధరలు భారీగా పెరుగుతాయ్.. కారణాలివే.. అమెరికా ఇంధన శాఖ మంత్రి హెచ్చరిక

Oil Prices Hike : హర్మూజ్ జలసంధి వద్ద ఉధ్రిక్తతల వేళ వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడారు. ఇంధన ధరలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Oil Prices Hike

  • పశ్చిమాసియాలో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
  • హర్మూజ్‌ జలసంధి దిగ్భందం
  • రానున్న వారాల్లో భారీగా పెరగనున్న చమురు ధరలు

Oil prices : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలు పూర్తిగా నిలిపోయే అవకాశం ఉంది.

Also Read : SSC Phase 14 Apply Online : టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తయిన వారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 3వేల ఉద్యోగాలు.. భారీగా జీతం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

శాంతి చర్చలు విఫలం తరువాత ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను దిగ్భందించాలని తమ నౌకాదళాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దీంతో దిగ్భంధన ప్రక్రియను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. హర్మూజ్ సమీపంలో బలగాలను భారీగా మోహరించింది. ఇరాన్ కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలన్నింటినీ అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ దిగ్భంధనం అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఒపెక్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మార్చి నెలలో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఉత్పత్తి భారీగా తగ్గిది. ఇరాక్ లో దాదాపు 61శాతం మేర ఉత్పత్తి తగ్గింది. కువైట్ లో 53శాతం, యూఏఈలో 44శాతం, సౌదీ అరేబియాలో 23శాతం ఉత్పత్తి తగ్గిపోయిందని నివేదిక పేర్కొంది. రోజువారీ ఏడు మిలియన్ల బ్యారెళ్ల నుంచి ఏడు లక్షల బ్యారెళ్లకు పడిపోయిందని సౌదీ మీడియా వెల్లడించింది.

హర్మూజ్ జలసంధి వద్ద ఉధ్రిక్తతల వేళ వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయిందని, రానున్న వారాల్లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని హర్మూజ్ లో నౌకల రాకపోకలు మొదలైనా.. రవాణా మునుపటి స్థాయికి చేరే వరకు చమురు ధరల మోత భారీగా ఉంటుందని పేర్కొన్నారు. హర్మూజ్ లో నౌకల రాకపోకలు గణనీయ స్థాయిలో పెరిగే వరకు ఇంధర ధరలు అధికంగా ఉండొచ్చునని.. పెరుగుతూనే ఉండొచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.