Blind Therapy Dog : కాళ్లు కట్టేసి బుల్లెట్లతో తూట్లు పొడిచినా..హాని చేసిన మనషులకు సేవ చేస్తున్న గ్రేట్ డాగ్..

పెంపుడుకుక్కను గన్ షూట్ ప్రాక్టీసుగా మార్చి అత్యంత దారుణంగా హింసించారు దాని యజమానులు. చావు నుంచి కోలుకున్న ఆ కుక్క ఎంతోమందికి సహాయంగా మారింది.

Blind Therapy Dog (1)

blind therapy dog : పెంపుడు కుక్కల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు.వాటికి కష్టమొస్తే యజమానులు తల్లడిల్లిపోతారు.పెంపుడు కుక్క చనిపోతే కృంగిపోతారు. కొంతమంది యజమానులైతే ఏకంగా తమ పెంపుడు కుక్కలకుగుడులు కట్టినవారు కూడా ఉన్నారు. మరికొందరు తమ కుక్కలకు అనారోగ్య సమస్యలు వస్తే లక్షలు ఖర్చుపెట్టినవారు ఉన్నారు. కానీ ఓ పెంపుడు కుక్క యజమానులు మాత్రం నరరూప రాక్షసులుగా మారారు తమ పెంపుడు కుక్కపాలిట. ఆ కుక్కను గన్‌ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వాడుకున్నారు. కాళ్లు కట్టేసి దాన్ని షూట్ చేస్తు రాక్షసానందం పొందారు. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 200ల బుల్లెట్లతో దాన్ని షూట్ చేశారు.

తీవ్రంగా గాయపడిన ఆ కుక్క చచ్చిపోయిందని అవతల పారేశారు. కానీ దాన్ని అదృమో ఏమోగానీ బతికి బయటపడింది. తనను అత్యంత దారుణంగా వ్యవహరించిన మానవజాతికే సేవలు చేస్తోందా కుక్క. మంచి మనుషుల తోడుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. యజమానుల దాడిలో ఓ కన్ను..ఓ చెవి పోగొట్టుకున్న ఆ కుక్క మతి మరుపు వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం చేస్తోంది.

లెబనాన్‌కు చెందిన మ్యాగీ అనే కుక్క. దాన్ని పెంచుకునే యజమానులు (ప్రస్తుతం మాజీ యజమానులు) మ్యాగీ పట్ల అతంత్య క్రూరంగా ప్రవర్తించారు. గన్‌ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేయటానికి దాన్ని వాడుకున్నారు. అదికదలకుండా తమ గురి తప్పకుండా ఉండటానికి మ్యాగీ కాళ్లు కట్టేసి పెల్లెట్స్‌(డూప్లికేట్‌ గన్‌కు సంబంధించిన బుల్లెట్‌ లాంటి గుళ్లు)తో కాల్పులు జరిపారు. దాని ఒంటినిండా పెల్లెట్స్‌తో తూట్లు పొడిచారు. ఆ బాధకు పాపం అది అరిచి అరిచి అంగలార్చింది.కానీ వారి మనస్సు బండరాళ్లో ఏమోగానీ ఏమాత్రం కనికరించాలేదు. బాధతో విలవిల్లాడుతు అరిచినా పట్టించుకోలేదు. దాని ముక్కు, రొమ్ము, భుజాలు, చెవులు, కన్నుతో సహా ఇతర శరీర భాగాల్లో దాదాపు 200 గుళ్లు దింపారు. అది బాధతో అరుస్తుంటే రాక్షసానందం పొందారు.మనుషులని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేలా ప్రవర్తించారు.

దాని ముఖంపై కాల్చటంతో కంటి చూపుకోల్పోయింది.
దాని దవడ ఎముక విరిగిపోయింది. ఓ చెవిని కూడా కోల్పోయింది. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న దాన్ని దూరంగా పడేశారు. చావు బతుకులతో పోరాడుతుండగా దాన్ని అదృష్టమోమో గానీ..‘‘ వైల్డ్‌ యాట్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’’ అనే జంతు సంరక్షణా సంస్థ సభ్యుడు ఒకరు చూసి దాన్ని రక్షించారు. దాని పరిస్థితి గమనించిన ఆ సంస్థ చలించిపోయింది. ఆ తరువాత మ్యాగీ పరిస్థితి గురించి అందరికి తెలిసింది.దీంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బ్రిగ్టన్‌కు చెందిన క్యాసీ చార్లీన్‌ అనే మహిళ మ్యాగీ పరిస్థితి తెలుసుకుని చలించిపోయింది. దాన్ని దత్తత తీసుకుంది. దానికి శిక్షణ ఇచ్చి థెరపీ డాగ్‌గా తయారు చేసింది.

2019లో మ్యాగీ పూర్తి స్థాయి థెరపీ డాగ్‌గా తయారైంది. అలా మ్యాగీ డిమెన్షియా(మతి మరుపు వ్యాధి)తో బాధపడుతున్న వారికి సహాయం చేస్తోంది. అంతేకాదు..స్కూళు పిల్లలు, పోలీస్‌, ఫైర్‌ ఫైటర్స్‌కు తోడుగాసహాయంగా మారింది. 2020లో కరోనా సమయంలో కూడా మ్యాగీ ఎన్నో సేవలందించింది.

దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టడంతో పలు ఆంక్షలు ఎత్తేశారు. దీంతో చాలా నెలల తర్వాత తను ఉంటున్న కేర్‌ హోమ్‌కు చేరుకుంది మ్యాగీ. అక్కడ ఉంటున్న తన కిష్టమైన వ్యక్తి యానీని కలుసుకుంది. యానీని కలుసుకుని సంవత్సరం అయినా ఆమెను మ్యాగీ ఏ మాత్రం మర్చిపోలేదు. కేర్‌ హోమ్‌లోకి అడుగుపెట్టగానే నేరుగా యానీ రూమ్‌ దగ్గరకు పరుగు పెట్టుకుంటూ వెళ్లింది. తోక ఊపుతో ఆమెను ఆనుకుని పడుకుని తన ప్రేమను ప్రకటించింది.ఆ తర్వాతే మిగతా వ్యక్తుల్ని కలుసుకుంది. ప్రస్తుతం మ్యాగీ కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మ్యాగీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంతో మ్యాగీ కష్టంలో ఉన్నప్పుడు దత్తత తీసుకోవటానికి ఎవ్వరూ రాలేదు. కానీ..ఇప్పుడు లక్షల మంది దాన్ని పెంచుకోవటానికి ముందుకొస్తున్నారు.