Single Potato Chip Sale : ఓరి ద్యావుడో..ఒకే ఒక్క ఆలూ చిప్ ధర రూ.1.63 లక్షలు..!!

ఓరి ద్యావుడో..ఒకే ఒక్క ఆలూ చిప్ ధర రూ.1.63 లక్షలు..!! ఏంటీ షాక్ అయ్యారా? దీని ప్రత్యేకత ఏమిటంటే..

Single Potato Chip: ఆలూ చిప్స్ అంటే ఇష్టపడనివారుండరు. సాధారణ రోడ్డు పక్క ఆలూ చిప్స్ నుంచి బింగో, లేస్ వంటి బ్రాండ్స్ ఆలూ చిప్స్ కు మంచి డిమాండ్ ఉంది. చాలా ఇష్టంగా తినే ఆలూ చిప్ప్ ప్యాకెట్ ధర ఎంతుంటుంది? సాధారణ చిప్స్ ప్యాకెట్ అయితే రూ.15లు ఉంటుంది. అదే బ్రాండ్ అయితే అదేనండీ బింగో, లేస్, హల్దీరామ్… చిన్నసైజు ప్యాకెట్ రూ.10కి ఉంటుంది. కాస్త పెద్ద సైజు అయితే రూ.50 వరకు ఉంటుంది. కానీ ఒకే ఒక్క సింగిల్ ఆలూ చిప్స్ ధర తెలిస్తే షాక్ అయి తీరాల్సిందే.

Also read : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

ఆ రేంజ్ లో ఉంది మరి దాని Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లుధర..ఏంటీ ఎక్కడైనా ఒకే ఒక్క ఆలూ చిప్ అమ్ముతారా? అనేది చాలా పెద్ద డౌటనుమానం వస్తుంది. కానీ అది జరింగింది. సింగిల్ పీస్ చిప్‌ను అమ్మడం ఎక్కడా చూసి ఉండం. కానీ ఈకామర్స్ దిగ్గజం ‘ఈబే’లో ఓ వ్యక్తి ఒకే ఒక్క చిప్ ముక్కను అమ్మకానికి పెట్టాడు. దాని ధర అక్షరాలా 1 లక్షా 63 వేలు..!! ఏంటీ షాక్ అయ్యారా? అయ్యే ఉంటారులెండి. ఎందుకంటే ఒకే ఒక్క ఆలూ చిప్ ను అమ్మటమే ఓ విశేషమనుకుంటే దాని ధర లక్షకుపైగా ఉండటం మరో పెద్ద విశేషం కాక మరేమిటి?!

Also read : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ వింత ఘటన వివరాల్లోకి వెళితే..ఇంగ్లాండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌కి చెందిన ఓ వ్యాపారి ఈ చిప్స్ ప్యాకెట్‌ను ఈబేలో మే 3న ఈ చిప్ పీస్‌ను అమ్మకానికి పెట్టాడు. దీని ధర 2,000 యూరోలుగా పేర్కొన్నారు. అంటే.. మన కరెన్సీలో రూ.1.63 లక్షలు. పుల్లటి క్రీమ్, ఆనియన్ ఫ్లేవర్‌తో ఈ చిప్‌ను తయారుచేసినట్లు డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. దీని షేప్ చాలా ప్రత్యేకమైనదని… పైన ఒక అరుదైన ముడత ఉంటుందని.. ఇదొక సరికొత్త ప్రొడక్ట్ అని పేర్కొన్నారు. ఎంత అరుదైన ప్రత్యేకత ఉన్నామరీ ఇంత ధరేంటని దీని గురించి తెలిసినవారు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలా సింగిల్ చిప్ పీస్‌ను అమ్మాలనే ఆలోచన ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతున్నారు జనాలు.

Also read : 1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన

కాగా..గతంలో ఓ వ్యక్తి ఇలాగే కేవలం టూ పీస్ చిప్స్‌ను 50 యూరోలకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో విక్రయానికి పెట్టాడు. ఇటీవల మెక్ డొనాల్డ్‌కి చెందిన చికెన్ నగ్గెట్‌పై ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించగా ఓ వ్యక్తి ఏకంగా రూ.73 లక్షలకు కొనుగోలు చేశాడు. దీని షేప్‌కి ఉన్న ప్రత్యేకత కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడైనట్లు మెక్‌డొనాల్డ్స్ తెలిపింది. పొలిన్జ అనే అమెరికాకు చెందిన వ్యక్తి దీన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

Also read :  1984 Spider Man Comic : స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ ధర రూ.24 కోట్లు..!!

 

ట్రెండింగ్ వార్తలు