Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

40 ఏళ్ల క్రితం నాటి కేకు ముక్క వేలానికి సిద్ధంగా ఉంది. ఈ కేకు ముక్క వేలం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూడటం విశేషం. ఇంతకీ ఈ కేకు వేాలానికి నిర్ణయించిన ధర వింటే షాక్ అవ్వాల్సిందే.

Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Cake Slice Auction

princess diana and prince charles wedding cake auction G 40 సంవత్సరాల నాటి ఓ కేకు ముక్కను వేలం వేయనున్నారు. నాలుగు దశాబ్దాల నాటి కేకు ముక్కను దక్కించుకోవటానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు అంటే ఆశ్చర్యమనిపిస్తుంది. అసలు అంతకాలం కేకు ముక్క ఈనాటికి ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? అసలు దాన్ని వేలం వేయటానికి కారణమేంటి? ఆ కేకు ఎక్కడిది? ఎవరిది? ఎవరు తిన్నది? ఏ సందర్భంలో కట్ చేసింది? అనే డౌట్స్ రానే వస్తాయి. ఆకాలం నాటి కేకు ముక్కను వేలం వేస్తున్నారు అంటే ఏదో విశేషంగా ఉండే ఉంటుంది. నిజమే మరి..ఆ కేకు ముక్కకు అంతటి ఘనత ఉంది మరి. బ్రిటన్‌ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడమే ఆ కేకు ముక్క విశేషం. దీంతో ఆ కేకు ముక్కను దక్కించుకోవటానికి ఎంతోమంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రిన్సెస్ డయానా. అందానికి వ్యక్తిత్వానికి మారుపేరు.పరిచయం అవసరం లేని ప్రపచం ప్రసిద్ధి పొందిన మహిళ. అటువంటి ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అంటే 1981 కాలంలో తయారు చేసిన కేక్‌ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారక పెళ్లి కేకుల్లోని ఓకేకులో ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్‌ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది.

ఈ కేక్‌ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వగా..ఆమె దీన్ని ఓ పూల కేక్‌ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్‌ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్‌ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల వెడ్డింగ్ కేక్‌’ అని ఉంది. 24-07-81 అని డేట్‌ కూడా ఉంది. స్మిత్‌ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మగా..ఆ తరువాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు.

త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్‌ ముక్క 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. అంటే భారత కరెన్సీలో 31 లక్షల నుంచి 50 లక్షలకు పైనే
ఈ కేక్‌ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్‌ వింటర్‌ ఔక్షనీర్స్‌ సీనియర్‌ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్‌ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు.