Israel-War: పాలస్తీనాకు భారత విపక్ష నేతల సంఘీభావం.. యుద్ధం వేళ ఇండియా గురించి పాలస్తీనా రాయబారి ఏమన్నారో తెలుసా?

పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్ హైజా మాట్లాడుతూ... గాజాలో జరుగుతున్న దాడులను ఆపడానికి భారత్..

Adnan Abu al Haija

Palestine-Hamas: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ పాలస్తీనాకు భారత ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఇతర రాజకీయ నాయకులు ఇవాళ సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్ హైజాను కలిశారు.

అనంతరం రాజ్యసభ ఎంపీ జావేద్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ‘పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపడానికి మేము అద్నాన్ అబు అల్ హైజాను కలిశాము. సంప్రదాయ పరంగా పాలస్తీనాతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. పాలస్తీనాకు మేము మిత్రులం. ఆ ప్రాంతాన్ని అణచివేయడానికి సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్న వేళ మేము పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నాం’ అని చెప్పారు.

రాష్ట్రీయ లోక్ దళ్ నాయకుడు షాహిద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘మహాత్మా గాంధీ, లోహియా, జయప్రకాశ్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన పాలసీనే భారత దేశ విధానం. అంటే పాలస్తీనా హక్కులకు మద్దతు తెలుపుతాం. మేము ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించాం.

అయితే, పాలస్తీనాకు కూడా హక్కు ఉంది. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా గాజాపై దాడులు జరుగుతున్నాయి’ అని చెప్పారు. సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ.. గాజాలో యథేచ్ఛగా జరుగుతున్న హింస అంటే నరమేధాన్ని బహిరంగంగా ప్రకటించడమేనని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌పై భారత్ ఒత్తిడి తీసుకురావాలి..

పాలస్తీనా రాయబారి అద్నాన్ అబు అల్ హైజా మాట్లాడుతూ… గాజాలో జరుగుతున్న దాడులను ఆపడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Israel-Gaza war : గాజాలో భూతల దాడులకు సిద్ధం.. గర్జించనున్న ఇజ్రాయెల్ దళాలు