Israel-Gaza war : గాజాలో భూతల దాడులకు సిద్ధం.. గర్జించనున్న ఇజ్రాయెల్ దళాలు

హమాస్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు.,,,

Israel-Gaza war : గాజాలో భూతల దాడులకు సిద్ధం.. గర్జించనున్న ఇజ్రాయెల్ దళాలు

Israel-Gaza war

Updated On : October 16, 2023 / 12:04 PM IST

Israel-Gaza war : హమాస్‌పై ఇజ్రాయెల్ భూతల దాడులు జరిపేందుకు సమాయత్తం అయింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజా నగరం నుంచి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. గాజాలో 2.4 మిలియన్ల జనాభా ఉండగా వారిలో సగం మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి పోయారు. ఇజ్రాయెల్ అధికారులు గాజాపై ఏదైనా భూతలదాడి రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంది. పాలస్తీనా గ్రూప్ హమాస్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించినప్పటి నుంచి ఉత్తర గాజా స్ట్రిప్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

బంకర్లలో నుంచి బందీల విడుదలకు సన్నాహాలు 

భూ-ఆధారిత దాడికి సన్నాహకంగా గాజా శివార్లలో ఇజ్రాయెల్ సైన్యం సాయుధ వాహనాలను మోహరించింది. గాజాపై నిరంతర బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా మరణించారు. అక్టోబరు 7 దాడులకు గాజాలోని హమాస్ కమాండర్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ బాధ్యుడిగా పేర్కొంది. హమాస్‌ కిడ్నాప్ చేసిన 150 మంది బందీలను సొరంగాలు, భూగర్భ బంకర్లలో ఉంచినట్లు సమాచారం. దీంతో బందీలను రక్షించడం ఇజ్రాయెల్ దేశానికి సవాలుగా మారింది.

హమాస్ కమాండర్ల హతం

ఇజ్రాయెల్‌లో కిబ్బట్జ్ నిరిమ్ మారణకాండకు కారణమైన హమాస్ అగ్ర కమాండర్ బిల్లాల్ అల్ కేద్రా గాజా స్ట్రిప్‌కు దక్షిణాన ఉన్న ఖాన్ యునిస్ నగరంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించాడు. ఇస్లామిస్ట్ గ్రూప్ వైమానిక కార్యకలాపాలకు నేతృత్వం వహించిన హమాస్ సీనియర్ మిలటరీ కమాండర్ మురాద్ అబు మురాద్ శనివారం గాజా నగరంపై జరిపిన మరో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమయ్యాడు. బందీలందరినీ విడుదల చేయాలని హమాస్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు.

ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్

గాజాలో హమాస్ ఉగ్రవాదులందరినీ హతమార్చేందుకు ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్ చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. వైమానిక దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 లక్షలకంటే ఎక్కువ మంది ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి వెళ్లారు. తమ దేశానికి చెందిన బందీలను విడుదల చేయించేందుకు ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ చేపట్టనుంది.

Israel Army

Israel Army

Also Read : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు

హమాస్‌ను సర్వనాశనం చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దేశంలో 1,69,000 మంది ఆర్మీ ఉంది. మరో 4,65,000 మంది రిజర్వ్ ఆర్మీ ఉంది. ఇజ్రాయెల్ దేశ ఆర్మీ ముందు హమాస్ ఆర్మీ సంఖ్య చాలా తక్కువ. కేవలం 15వేల నుంచి 20 వేలమంది లోపే హమాస్ సైన్యం ఉంది. గాజాలో నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలు నిలిచిపోయాయి. ఇప్పుడు గాజా జనాభాలో సగంమంది వారి ప్రాంతం నుంచి పారిపోవాలని హెచ్చరించారు.

బందీల విడుదలకు ఆపరేషన్

బందీల్లో ఎక్కువ మంది ఇజ్రాయిలీలున్నారు. విదేశీ పౌరులు, ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉన్నారు. అమెరికా, ఫ్రాన్స్, యూకేతో సహా పలు ఇతర దేశాలు ఈ ఆపరేషన్‌లో తమ వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం తమ పౌరుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడదని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు.

Also Read : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్‌క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు

గాజాతో సరిహద్దును పంచుకునే ఈజిప్ట్ దేశంలో ఇప్పటికే ఒత్తిడి పెరుగుతోంది. తమతో ఉండే రఫా సరిహద్దు క్రాసింగ్ నుంచి గాజా వాసులకు ఈజిప్టు సహాయాన్ని అందిస్తోంది. హమాస్‌ను ఇజ్రాయెల్ పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయగలిగితే, ఆ స్థానంలోకి ఎవరు వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.