Zoo Video: ‘జూ’కు వచ్చిన విజిటర్స్‌ను ఎత్తి కుదేసిన చింపాంజీ

'జూ'కు వచ్చిన వ్యక్తిని పట్టుకోవడమే కాకుండా ఎత్తికుదేసింది చింపాంజీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇండోనేషియాలోని కసంగ్ కులీమ్ జూలో రికార్డ్ అయిన వీడియో గురించే ఈ ముచ్చటంతా..

Zoo Viral Video

Zoo Video: ‘జూ’కు వచ్చిన వ్యక్తిని పట్టుకోవడమే కాకుండా ఎత్తికుదేసింది చింపాంజీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇండోనేషియాలోని కసంగ్ కులీమ్ జూలో రికార్డ్ అయిన వీడియో గురించే ఈ ముచ్చటంతా..

వీడియోలో ఓ వ్యక్తి బోనులో ఉన్న చింపాంజీకి దగ్గరగా నడుచుకుంటూ వస్తున్నాడు. చూడటానికి వచ్చిన విజిటర్ అంతగా నచ్చేశాడో ఏమో.. టీ షర్ట్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించింది. గట్టిగా లాగేస్తుండటంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి విడిపించేందుకు ప్రయత్నించాడు. వాళ్ల బలం సరిపోలేదు. చింపాంజీ టీషర్ట్ తో పాటు కాలిని పట్టుకుని గట్టిగా బోనువైపుకు లాక్కొంది.

అంతే.. కాలిని ఒక్కసారిగా పైకి లేపడంతో రెండు కాళ్లు గాల్లో ఉండి కిందపడిపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియోను 130లక్షల మంది చూశారు. దీనిపై జూ సిబ్బంది వివరణ ఇస్తూ మరో వీడియో పోస్టు చేశారు.

Read Also: మూడేళ్ల పాపను జూలో ఎలుగుబంటి మీద విసిరేసిన తల్లి

“సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. kasangkulim జంతుప్రదర్శనశాలలో @ipin_chill జరిగిన ఘటన. జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. kasangkulim జంతుప్రదర్శనశాల నుంచి క్షమాపణలు కోరుతున్నాం. ఇది మళ్లీ జరగదని ఆశిస్తున్నాము” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.