US Presidential Polls-2024
Biden on Chinese ‘spy’ balloon: చైనా స్పై బెలూన్ ను వెంటనే కూల్చేయాలని తాను ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని వైమానిక దళం కూల్చేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. స్పై బెలూన్ ను పెంటగాన్ యుద్ధ విమానం సాయంతో సముద్రతలానికి తీసుకెళ్లి విజయవంతంగా కూల్చేసిన విషయం తెలిసిందే. దీనిపై మేరీల్యాండ్ లో బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
”బెలూన్ గురించి అధికారులు నాకు బుధవారమే వివరాలు తెలిపారు. వీలైనంత త్వరగా దాన్ని కూల్చేయాలని నేను పెంటగాన్ కు ఆదేశాలు ఇచ్చాను. భూమిపై ఉన్న ఎవరికీ హాని జరగకుండా దాన్ని కూల్చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సరైన సమయం కోసం వేచి చూసి సముద్రతలంపై దాన్ని కూల్చేశారు” అని బైడెన్ చెప్పారు.
స్పై బెలూన్ ను విజయవంతంగా కూల్చేసినందుకు నేను అధికారులకు అభినందలు చెబుతున్నాను. దీనిపై విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయి. సురక్షిత ప్రాంతంలోనే దాన్ని కూల్చేయాలని అధికారులు నిర్ణయం తీసుకోవడంతో సమయం పట్టిందని చెప్పారు. కాగా, గతంలోనూ అమెరికా గగనతలంలో ఇటువంటి బెలూన్లు కనపడినట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతోంది.
Chinese spy balloon: చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన అమెరికా