Hamza bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకు ఇంకా చావలేదు.. అల్‌ఖైదా నాయకత్వంతో దాడులకు ప్లాన్..!

Osama Bin Laden Dead Son : ది మిర్రర్ ఇటీవలి ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. హంజా బిన్ లాడెన్ సజీవంగా ఉండటమే కాకుండా అల్-ఖైదా పునరుజ్జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని నివేదించింది.

Osama Bin Laden's 'Dead Son' Is Alive, Leading Al-Qaeda

Osama Bin Laden Dead Son : అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, 9/11 దాడుల సూత్రధారి, ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఇంకా బతికే ఉన్నాడట.. నిజానికి 2019 అమెరికా వైమానిక దాడిలో ఇతడు హతమయ్యాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. కానీ, అతడు ఇంకా సజీవంగానే ఉన్నాడని, టెర్రర్ గ్రూపును నడిపిస్తున్నాడంటూ ఓ నివేదిక వెల్లడించింది.

ది మిర్రర్ ఇటీవలి ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. హంజా బిన్ లాడెన్ సజీవంగా ఉండటమే కాకుండా అల్-ఖైదా పునరుజ్జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడని నివేదించింది. తన తండ్రి బిన్ లాడెన్‌ను హతమార్చిన పాశ్చాత్య దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Read Also : మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఇవి తప్పక గుర్తుంచుకోండి!

ఈ నేపథ్యంలో సీనియర్ తాలిబాన్ నాయకులకు హంజా నాయకత్వం గురించి తెలుసు. అందుకే, అతనితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ తాలిబన్ నాయకులు హంజాకు, అతడి కుటుంబానికి రక్షణ, మద్దతును అందిస్తున్నారని తెలిపింది. అంతేకాదు.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ టెర్రర్ గ్రూప్ 10 ఆల్ ఖైదా టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసిందని, పాశ్చాత్య దేశాలను వ్యతిరేకించే గ్రూపులతో ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇప్పుడు, హంజా నాయకత్వంతో ఆల్‌ఖైదాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అంటున్నారు.

లాడెన్ కుటుంబానికి రక్షణగా తాలిబన్ నాయకులు :
“ఈ తాలిబన్ నాయకులు.. అతనితో వరుసగా సమావేశాలు నిర్వహిస్తారు. అతనితో పాటు కుటుంబానికి భద్రత కల్పిస్తారు. అల్-ఖైదా, తాలిబాన్‌ల మధ్య లోతైన సంబంధం. పాశ్చాత్య ప్రభుత్వాలు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. హంజా అల్-ఖైదా నాయకత్వానికి అధిరోహించాడు. ఇరాక్ యుద్ధం తర్వాత అత్యంత శక్తివంతమైన పునరుజ్జీవనం వైపు నడిపించాడు” అని నివేదిక పేర్కొంది. 34 ఏళ్ల హమ్జా కాబూల్‌కు తూర్పున 100 మైళ్ల దూరంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన జలాలాబాద్‌లో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అతని నాయకత్వంలో, అల్-ఖైదా పాశ్చాత్య లక్ష్యాలపై భవిష్యత్ దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

అదనంగా, అతని సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్ కూడా గ్రూపులో పునరుద్ధరణ ప్రయత్నాలలో పాల్గొంటున్నాడని తెలిపింది. “అతని ఆధ్వర్యంలో, అల్-ఖైదా పాశ్చాత్య లక్ష్యాలపై భవిష్యత్తులో దాడులకు తిరిగి గ్రూపును సిద్ధం చేస్తోంది. హంజా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ముందుకు నడిపించనున్నాడు. అంతేకాకుండా, ఈ పునరుద్ధరణలో హంజా సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు” అని నివేదిక పేర్కొంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హంజా, అతని నలుగురు భార్యలు ఇరాన్‌లో ఆశ్రయం పొంది ఉండవచ్చునని నివేదిక సూచిస్తుంది.

హంజా బిన్ లాడెన్ ఎవరు? :
హంజా బిన్ లాడెన్.. ఇతడిని “జిహాద్ క్రౌన్ ప్రిన్స్” అని పిలుస్తారు. ఒసామా బిన్ లాడెన్ 20 మంది పిల్లలలో 15వవాడు. అతని మూడవ భార్య కుమారుడు. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. నివేదిక ప్రకారం.. అతడు 9/11 దాడులకు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో తన తండ్రితో కలిసి ఉన్నాడు. ఆయుధాలను ఎలా వాడాలో నేర్చుకున్నాడు. చాలావరకూ ఉగ్రవాద క్యాంపెయిన్ వీడియోలలో కనిపించాడు. అక్కడ అమెరికన్లు, యూదులు, క్రూసేడర్‌లను విమర్శించాడు.

2019లో, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజ్నీ ప్రావిన్స్‌లో విజయవంతమైన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో హమ్జా మరణించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ, సీఐఏ అతడి హతమయ్యాడనే నిర్ధారించే ఎలాంటి డీఎన్ఏ ఆధారాలను కూడా పొందలేదు. అప్పటినుంచి అతడు బతికే ఉన్నాడా లేదా అనేది అనిశ్చితంగా ఉంది. అదే సమయంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలో “అఫ్ఘనిస్తాన్/పాకిస్తాన్ ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాద నిరోధక చర్యలో అల్-ఖైదా సభ్యుడు, ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ హతమయ్యాడు.”ని పేర్కొన్నారు.

Read Also : Bangladesh Hilsa : బెంగాలీలకు బంగ్లాదేశ్ షాక్.. క్షమించండి.. ఈ దుర్గా పూజకు ‘హిల్సా’ను పంపలేం..!