Oscars 2020 : రెడ్ కార్పెట్ పై హలీవుడ్ తారల తళుకులు!

  • Publish Date - February 10, 2020 / 05:55 AM IST

ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ పై తమ వినూత్న డ్రెస్సింగ్ స్టయిల్‌తో  ప్రదర్శనలు ఇచ్చారు. 92వ అకాడమీ అవార్డుల్లో ఫొటోలకు ఫోజులిస్తూ రెడ్ కార్పెట్ కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. నామినిలు, అతిథులతో పాటు హాలీవుడ్ నటీనటులంతా ఆకర్షణీయమైన వస్త్రాధారణలో తళుకుమని మెరుస్తూ సందడి చేశారు.

అందరూ హాలీవుడ్ తారలు కలిసి ఒకే చోట ప్రత్యేక వేషధారణలో కనువిందు చేశారు. 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హలీవుడ్ తారలు తళుకుమని మెరిసిపోతున్నారు. రెడ్ కార్పెట్‌పై ఒక్కొక్కరూ వెరైటీ డ్రెస్సింగ్ స్టయిల్‌తో వీక్షకులను అలరిస్తున్నారు.

ఆస్కార్ నైట్.. అంటే హాలీవుడ్ లో ఎంతో గ్లామరస్ అవార్డుల ఫంక్షన్.. హలీవుడ్ భామలు.. పింక్ గౌన్లలో, బేసిక్ బ్లాక్, స్టేట్మెంట్ నెక్లస్ లతో రెడ్ కార్పెట్ పై అందాలను అరబోస్తూ హైలెట్ గా నిలుస్తున్నారు. లాస్ ఏంజెల్స్ లోని డాల్ బై థియేటర్లో 92వ ఆస్కార్ అవార్డుల 2020 ప్రదానోత్సవం జరిగింది.

ఈ ఏడాదిలో ఆస్కార్ అవార్డులకు నామినెట్ అయిన వారి జాబితా విడుదల అవుతోంది. అస్కార్ 2020 విజేతల జాబితాలో అత్యధికంగా నామినెట్ అయిన చిత్రం జోకర్. 11 ఆస్కార్ నామినేషన్లలో జోకర్ జాక్ పాట్ కొట్టేసింది. మరోవైపు సౌత్ కొరియన్ ఫిల్మ్ పారాసైట్.. ఫస్ట్ టైం బెస్ట్ ఫిక్చర్ అవార్డును సొంతం చేసుకుంది.