Sri Lanka type crisis
Sheikh Hasina on Rohingya: బంగ్లాదేశ్‌కు వలస వచ్చిన లక్షలాది మంది రొహింగ్యాలు తమ దేశానికి భారంగా మారరని ఆ దేశ ప్రధానమంత్రి షెయిక్ హసీనా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రొహింగ్యాలను వారి సొంత ప్రాంతాలకు పంపేందుకు ప్రపంచ సమాజం చొరవచూపాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. రొహింగ్యాలు తమకు సవాలు మారారని అన్నారు.
భారత్ అతి పెద్ద దేశమని, రొహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వగలిగే సామర్థ్యం ఉందని, అయితే, భారత్ లో రొహింగ్యాలు అధిక సంఖ్యలో లేరని చెప్పారు. తమ దేశంలో మాత్రం 11 లక్షల మంది రొహింగ్యాలు ఉన్నారని చెప్పారు. వారిపట్ల తాము మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తున్నామని అన్నారు. కరోనా సమయంలోనూ వారిని తాము అన్ని రకాలుగా సాయం చేశామని చెప్పారు.
వారికి వ్యాక్సిన్లు కూడా వేయించామని తెలిపారు. అయితే, ఇంకా ఎన్నాళ్ళు వారు తమ దేశంలో ఉంటారని ఆమె ప్రశ్నించారు. రొహింగ్యాల్లో కొందరు డ్రగ్స్ సరఫరా, మరికొందరు ఆయుధాల వ్యాపారం, మహిళల అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ సమస్య రోజురోజుకీ పెరిగిపోతోందని అన్నారు. వారు తిరిగి వారి దేశానికి వెళ్ళిపోతే తమకే కాకుండా మయన్మార్‌కు కూడా మంచిందని అన్నారు.
Pakistan floods: వరదలతో అతలాకుతలం.. ప్రపంచ దేశాల సాయం కోరుతూ పాకిస్థాన్ అభ్యర్థన