చైనా కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దీంతో డాక్టర్లు మరింతగా బాధితులకు అండగా ఉంటూ వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. వారిని బ్రతికించటానికి తమ శాయశక్తులా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో చైనా దేశంలో పోలీసులు..డాక్టర్లు రోజుకు 20లపాటు నిద్రాహారాలు మానివేసి డ్యూటీలోనే ఉంటున్నారు.
దీంతో వారికి అస్సలు ఏమాత్రం విశ్రాంతి లేక అలసిపోతున్నారు. సోలిపోతున్నారు. కనీసం నిలబడే శక్తిలేక కూలిపోతున్నారు. ఇలా ఓడాక్టర్ పాపం రోజుకు 20 గంటలకు పైగా డ్యూటీ చేసి ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్ రావటానికి లిఫ్ట్ ఎక్కి ఆ లిఫ్ట్ లోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ లిఫ్టు లో నిద్ర ఆపుకోవటానికి ఎంతగా యత్నించాడో పాపం.కానీ సాధ్యం కాలేదు. లిప్ట్ లోనే కుప్పకూలిపోయాడు.
కాస్త ఓపిక చేసుకుని ఎలాగోలా పైకి లేచాడు. తూలుతూ లిఫ్ట్ దిగాడు. కానీ నాలుగు అడుగులు వేశాడో లేదో కుప్పకూలిపోయాడు. ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైనా డాక్టర్లు చేస్తున్న సేవలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే రోజుకు 20గంటలకు పైగా డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కూడా నిద్ర ఆపుకోవటానికి శతవిధాలా యత్నించాడు. తూలుకుంటూనే మెట్లు ఎక్కుతూ ఎలాగోలా పైకి ఎక్కాడు. కానీ కాసేపటికే మెట్ల మీంచి దొర్లుకుంటూ కుప్పకూలిపోయి పడిపోయాడు. ఇదీ చైనా కరోనా వైరస్ సోకినవారికి సేవలు చేసే పోలీసులు..డాక్టర్ల పరిస్థితి. కాగా..కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినవారు 18వందలకు పైగా ఉన్నారు.