ఎవ్వరూ లేకుండానే ప్రయాణించిన 46పాక్ విమానాలు

ఎవ్వరూ లేకుండానే ప్రయాణించిన 46పాక్ విమానాలు

Updated On : September 22, 2019 / 5:37 AM IST

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇస్లామాబాద్ నుంచి వెళ్లే 46 విమానాల్లో ఒక్కరు లేకుండానే గాల్లోకి ఎగిరాయట. 2016-17 సంవత్సరంలో ఇలా జరిగిందని ఓ మీడియా కథనంలో రాసుకొచ్చింది. జీయో న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇలా ప్రయాణించడం వల్ల 180మిలియన్ పాకిస్తాన్ రూపాయలు వృథాగా ఖర్చు అయ్యాయని వెల్లడించింది. 

అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ ఎటువంటి విచారణ జరపలేదని తెలిపింది. ఈ 46విమానాలతో పాటు హజ్ యాత్రికులను తీసుకొని పోయే 36 విమానాలు కూడా కూడా ప్రయాణికులు లేకుండానే గాల్లో ప్రయాణించాయట. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యాంటీ మనీ లాండరింగ్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి బ్లాక్ లిస్ట్‌లో ఉన్న పాకిస్తాన్ దేశానికి ఈ వార్త తీవ్రంగా నష్టం చేకూర్చనుంది. 

పుల్వామా ఘటన అనంతరం భారత్ నుంచి వెళ్లే విమానాలను పాక్ గగనతలంలో ఎగరకూడదంటూ ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. భారత ప్రముఖుల సైతం విమానాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చేందుకు పాక్ నిరాకరిస్తుంది.