గిల్గిత్-బాల్టిస్తాన్ కి తాత్కాలిక ప్రాంతీయ హోదా ప్రకటించిన పాకిస్తాన్

provisional provincial status to Gilgit-Baltistan POKలోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతానికి తాత్కాలిక ప్రాంతీయ హోదా ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఓ వైపు ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నప్పటికీ భారత్‌-పాకిస్తాన్‌ మధ్య వివాదాస్పద ప్రాంతమైన గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ కు తాత్కాలిక ప్రాంతీయ హోదాను కల్పిస్తున్నట్లు ఆదివారం(నవంబర్-1,2020)పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. కాగా, చైనాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సృష్టంగా అర్థమవుతోంది. భారతదేశం-చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను పెంచే స్వరం ఏర్పడే విస్తృత ప్రభావాలను కలిగి ఉన్నందున ఈ ప్రకటన భారీ ఆగ్రహాన్ని రేకెత్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



ఆదివారం గిల్గిత్ లో పర్యటించిన ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ…గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్(UNSC)తీర్మాణాలను దృష్టిలో పెట్టుకునే తాము గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతానికి తాత్కాలిక ప్రాంతీయ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా, చాలాకాలంగా గిల్గిత్-బాల్టిస్తాన్ యువత డిమాండ్ కూడా ఇదేనని…ఇవాళ ఆ డిమాండ్ ని తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు ఇమ్రాన్ ఖాన్.



కాగా, ఈ సమయంలో మరిన్ని వివరాలను ఇమ్రాన్ ఖాన్ వివరించలేదు. గిల్గిట్-బాల్టిస్తాన్ పాకిస్తాన్ యొక్క ఐదవ ప్రావిన్స్ ఎప్పుడవుతుందనేది అవుతుందనే విషయాన్ని ఇమ్రాన్ చెప్పలేదు. ఈ ప్రాంతం కోసం తన ప్రభుత్వం… అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించాలనుకుంటున్నట్లు.. అయితే నవంబర్ 15 న ఎన్నికలు జరగనున్నందున తాను వివరాలను ప్రకటించలేనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.



అయితే, ఈ సందర్భంగా భారత్ పై విమర్శలు గుప్పించడాన్ని మాత్రం ఇమ్రాన్ ఖాన్ విస్మరించలేదు. ఎప్పటిలానే భారత్ పై తన అక్కసు వెల్లగక్కారు. పాకిస్తాన్ కు బలమైన మిలటరీ ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ…పాక్ లో అలజడులు సృష్టించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాక్ లోని మెజార్టీలైన సున్నీ, మైనార్టీలైన షియా వర్గాల ప్రజలను విడదీసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ తొలగించి కశ్మీర్ ప్రజలను అణిచివేస్తున్న భారత ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు పాకిస్తాన్ కు బలమైన మిలటరీ ఉండాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ అన్నారు. భారత్ లో సీఏఏ,ఎన్ ఆర్సీ ద్వారా ముస్లింలను భారత ప్రభుత్వం అణిచివేస్తుందని ఆరోపించారు.



గతేడాది ఫిబ్రవరి లో పుల్వామా ఉగ్రవాది తర్వాత పాక్ యుద్ధస్ధావరాలపై వాయుదాడులు చేసే ఘటన సమయంలో భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్తమాన్ ని పాక్ మిలటరీ అదుపులోకి తీసుకున్న తర్వాత..భారత్ తమపై దాడిచేస్తుందనే భయంతో పాక్ ఆర్మీ చీఫ్ గజగజవణికిపోయి… అభినందన్ ను భారత్ కు అప్పగించారని ఇటీవల పాక్ ప్రతిపక్ష పార్టీ PML-N నేత అయాజ్ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇమ్రాన్ ప్రస్తావించారు. పాక్ లో ప్రతిపక్ష నాయకులు…భారత ప్రధాని నరేంద్ర మోడీ లాగా మాట్లాడుతున్నారని ఖాన్ అన్నారు.

గిల్గిత్-బాల్టిస్తాన్ పై భారత్
కాగా, గిల్గిత్-బాల్టిస్తాన్ విషయంలో పాక్ తీసుకున్న నిర్ణయంపై భారత్ స్పందించింది. గిల్గిత్-బాల్టిస్తాన్ కు తాత్కాలిక-ప్రాంతీయ హోదా కల్పిస్తూ పాకిస్తాన్ తీసుకున్న చర్య.. తన అక్రమ ఆక్రమణను మభ్యపెట్టే ప్రయత్నం అని భారతదేశం వ్యాఖ్యానించింది. పాకిస్తాన్.. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయమని మరోసారి ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది.



భారత విదేశాంగశాఖ మంత్రి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..గిల్గిట్-బాల్టిస్తాన్” అని పిలవబడే ప్రాంతంతో సహా జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ భూభాగాలు భారతదేశంలో అంతర్భాగమని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. పాకిస్తాన్ ప్రభుత్వానికి చట్టవిరుద్ధంగా మరియు బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై ఎటువంటి స్థానం లేదు. పాకిస్తాన్ తన అక్రమ ఆక్రమణను మభ్యపెట్టడానికి ఉద్దేశించిన ఇటువంటి ప్రయత్నాలు… ఏడు దశాబ్దాలుగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను, దోపిడీని మరియు స్వేచ్ఛను తిరస్కరించడాన్ని దాచలేవు. ఈ భారతీయ భూభాగాల స్థితిని మార్చడానికి ప్రయత్నించకుండా, పాకిస్తాన్ తన అక్రమ ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయమని మేము పిలుపునిస్తున్నాము అని అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.