Fake Doctor: డాక్టర్ నంటూ ఆపరేషన్ చేసిన సెక్యూరిటీ గార్డు..మహిళ మృతి..మేం ఏం చేయగలం అన్న ఆసుప్రతి యాజమాన్యం

నేనే డాక్టర్ ని అంటూ ఆ ఆసుపత్రి మాజీ సెక్యూరిటీ గార్డు ఆపరేషన్ చేసిన ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగింది.

Patient dies after security guard surgery : ఆర్ఎంపీ డాక్టర్లు చేసిన చికిత్స వల్ల రోగి మరణించాడనే వార్తలు వింటుంటాం. కానీ ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు ఆపరేషన్లు చేస్తాడని ఎక్కడా విని ఉండం. కానీ కేవలం కాసుల కక్కుర్తి కోసం ఓ మాజీ సెక్యూరిటీ గార్డు ఏకంగా ఓ మహిళకు ఆపరేషన్ చేసేసాడు. ఫలితంగా పాపం ఆమె ప్రాణాలు కోల్పోయిన ఘటన పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగింది. లాహోర్ ప్రభుత్వాసుపత్రిలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన మహ్మద్ వహీద్ భట్ అనే వ్యక్తి ఓ మహిళకు ఆపరేషన్ చేయగా ఆమె మృతి చెందింది.

లాహోర్ ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు మహ్మద్ వహీద్ భట్. కానీ ఆసుపత్రికి వచ్చే రోగులు లోపలికి రావాలంటే డబ్బులు ఇస్తేనే గానీ లోపలికి రానిచ్చేవాడు కాదు. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేసారు. అయినా అతనికి బుద్దిరాలేదు. అయినా అతడు ఆ హాస్పిటల్‌ను వదల్లేదు. ఏకంగా ఈసారి డాక్టర్ అవతారం ఎత్తాడు.ఆసుపత్రిలో కొంతమంది అండతో చిన్న చిన్న చికిత్సలు కూడా చేసేవాడు.

అక్కడితో ఈ నకిలీ డాక్టర్ ఊరుకోలేదు. ఏకంగా రోగుల ఇళ్లకు వెళ్లి మందులు ఇచ్చి..ఈ మందులు మీకు బయట ఎక్కడా దొరకవు అని చెప్పి భారీగా డబ్బులు గుంజేవాడు. ఈక్రమంలో గత రెండు వారాల క్రితం షమీమా బేగమ్ అనే 80 ఏళ్ల వృద్ధురాలు వెన్నెముక గాయంతో ఆస్పత్రికి వచ్చింది. ఇదే అదనుగా భావించిన మహ్మద్ వహీద్ భట్ ఓ టెక్నీషియన్ సహాయంతో వృద్ధురాలికి ఏకంగా ఆపరేషన్ చేసేశాడు.

ఆ తరువాత డబ్బులు కూడా తీసుకున్నాడు.అంతవరకూ బాగానే నడిచాయి ఈ సెక్యూరిటీ గార్డ్ వేషాలు. ఆపరేషన్ చేసిన ఆమెను డిశ్చార్జ్ చేసి..ఆ మరునాడు ఆమె ఇంటికి వెళ్లి డ్రెస్సింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత రోజు షమీమా బేగమ్ కు బ్లీడింగ్ కావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే అదే హాస్పిటల్ కు తీసుకొచ్చారు. దాంతో అసలు విషయం బయటపడింది. ఆమెకు ఎందుకలా జరిగింది? ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నారు? ఎవరు చేశారు? అని డాక్టర్ అడగగా..ఇక్కడే ఆపరేషన్ చేయించుకున్నట్లుగా చెప్పేసరికి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. దీంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

కానీ బ్లీడింగ్ అయిన షమీమా బేగమ్ కు డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం దక్కేలేదు. గత ఆదివారం (జూన్6,2021) మరణించింది. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేయగా..సెక్యూరిటీ గార్డును, అతడికి సహకరించిన ఆసుపత్రి టెక్నీషియన్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై హాస్పిటల్ చీఫ్ మాట్లాడుతూ..లాహోర్ ప్రభుత్వాసుపత్రి చాలా పెద్దది..ప్రతి డాక్టర్ మీదా..ఉద్యోగి మీదా నిఘా పెట్టటం సాధ్యం కాదు..తప్పించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు