Pakistan Airlines tells cabin crew to wear undergarments
Pak Airlines: పాకిస్తాన్కు చెందిన ఎయిర్లైన్స్ తీసుకున్న నిర్ణయం, సొంత దేశంలోనే పురువు పోగొట్టుకునేలా చేసింది. డ్రెస్ కోడ్లో భాగంగా ఎయిర్లైన్స్ సిబ్బంది లోదుస్తులు తప్పనిసరి వేసుకోవాలంటూ పాక్ ఎయిర్లైన్స్ తాజాగా ఆదేశాలిచ్చింది. వాస్తవానికి లో దుస్తులు వేసుకోకపోవడం వల్ల ఎయిర్లైన్స్ సేవలపై పేలవమైన ముద్ర పడుతుందని, దాని ద్వారా సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురవొచ్చని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఎయిర్లైన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై దీనిపై స్వదేశం నుంచే విమర్శలు గుప్పుమన్నాయి.
పనికిమాలిన ఆదేశాల్ని ఎయిర్లైన్స్ ఇచ్చిందంటూ పాకిస్తానీలు మండిపడుతున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి లో దుస్తులకు సంబంధం ఏంటంటూ పాక్ నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తుండడంతో ఎయిర్లైన్స్ తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు కోరింది. పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇచ్చుకున్నారు. డ్రెక్ కోడ్ ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతో ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
Rajastan Crisis: రాజస్తాన్ సీఎంగా తానే కొనసాగుతానని పరోక్ష సూచనలు చేసిన గెహ్లాట్