Pakistan Blocked Wikipedia : అభ్యంతరకరమైన కంటెంట్ తొలగించాలని.. వికీపిడియాను బ్లాక్ చేసిన పాకిస్తాన్

పాకిస్తాన్ లో వికీపిడియాను బ్లాక్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను తొలగించాలని స్థానిక ప్రభుత్వం వికీపిడియాకు నోటీసులు ఇచ్చింది. వికీపిడియా వెబ్ సైట్ ను పాకిస్తాన్ బ్లాక్ చేసింది.

Pakistan Blocked Wikipedia : పాకిస్తాన్ లో వికీపిడియాను బ్లాక్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను తొలగించాలని స్థానిక ప్రభుత్వం వికీపిడియాకు నోటీసులు ఇచ్చింది. వికీపిడియా వెబ్ సైట్ ను పాకిస్తాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన, దైవ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలను తొలగించాలని ఆ వెబ్ సైట్ కు పాకిస్థాన్ హెచ్చరిక చేసింది.

పాకిస్తాన్ టెలికాం అథారిటీ 48గంటల పాటు వికీపిడియా సర్వీసులను ఆపేసింది. దైవాన్ని దూషిస్తున్నట్లుగా ఉన్న కంటెంట్ ను తొలగించకుంటే వికీపిడియాను శాశ్వతంగా బ్లాక్ లిస్టులో పెడుతామని పాకిస్తాన్ హెచ్చరించింది. వికీపిడియాను బ్లాక్ చేసింది నిజమేనని పాకిస్తాన్ టెలికాం అథారిటీ ప్రతినిధి ధ్రువీకరించారు.

YouTube channels: తప్పుడు వార్తల ప్రసారం.. యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

వికీపిడియా వెబ్ సైట్ లో ఉచితంగా ఎన్ సైక్లోపీడియా అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వికీమీడియా ఫౌండేషన్ దీన్ని హోస్ట్ చేస్తోంది. దైవదూషణ ఉన్న కంటెంట్ ను తొలగించాలని వికీపిడియాకు నోటీసులు ఇచ్చినట్లు పీటీఏ ప్రతినిధి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు